Begin typing your search above and press return to search.
చిరు-150లో ఆలీ ఏం చేస్తాడంటే...
By: Tupaki Desk | 24 Jun 2016 11:44 AM GMTఎన్నో ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు మొదలైపోయింది. నిన్న తొలి రోజు షూటింగ్ సందర్భంగా చిరంజీవిని చూసిన వాళ్లందరూ మెస్మరైజ్ అయిపోయారు. చివరగా ఎనిమిదేళ్ల కిందట ‘శంకర్ దాదా జిందాబాద్’ చేసే సమయానికి కూడా చిరంజీవి ఇంత చక్కటి లుక్ తో లేడంటే అతిశయోక్తి కాదు. కొన్ని నెలలుగా బరువు తగ్గేందుకు బాగా కష్టపడి.. అనేక రకాల లుక్స్ ట్రై చేసి.. చివరికి పర్ఫెక్ట్ లుక్ తో ‘కత్తిలాంటోడు’ అనిపించాడు చిరు. ఇక నిన్నటి ఆన్ లొకేషన్ ఫొటోలు పరిశీలిస్తే.. అందులో కనిపించిన ఏకైక నటుడు ఆలీనే గుర్తించే ఉంటారు. సినిమాలలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తమిళ ‘కత్తి’లో సతీశ్ అన్ అప్ కమింగ్ కమెడియన్ పోషించిన పాత్రనే తెలుగులో ఆలీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ద్విపాత్రాభినయం అన్న సంగతి తెలిసిందే. అందులో టైటిల్ రోల్ చేసిన పాత్రకు తోడుగా ఉంటుంది సతీశ్ క్యారెక్టర్. ఇద్దరూ దొంగలే. కాకపోతే హీరో ఘరానా దొంగ. పక్కనుండే ఫ్రెండు అతడి వల్ల ఇబ్బంది పడే ఛోటా దొంగ. తమిళంలో ఆ ఫ్రెండు హీరోను ఏరా అనే పిలుస్తాడు. తెలుగులోకి వచ్చేసరికి ‘గురూ’ అని ఫిక్సయి ఉంటారేమో. సినిమాలో హీరో పాత్రతో సమానంగా ఈ పాత్రకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. కాబట్టి ఆలీకిది చాలా మంచి అవకాశంగానే చెప్పాలి. చిరు రీఎంట్రీ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ దొరకడమంటే చిన్న విషయం కాదు.