Begin typing your search above and press return to search.
భన్సాలీ `హీరమండి`లో ఛాన్సిస్తే ఫ్రీగా ఆలియా
By: Tupaki Desk | 11 Aug 2021 4:59 AM GMTకళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా-భాజీరావ్ మస్తానీ- పద్మావత్- గుజారిష్ వంటివి ప్రజల మనసు దోచి క్రిటిక్స్ ప్రశంసల్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కథానాయకుడిగా హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి క్లాసిక్ ని.. ఐశ్వర్యారాయ్- షారూక్ ద్వయంతో దేవదాస్ లాంటి గొప్ప ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇవన్నీ క్రిటిక్స్ తో పాటు ప్రజల మన్ననలు అందుకున్నాయి. ప్రస్తుతం ఆలియా ప్రధాన పాత్రలో గంగూభాయి కతియావాడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్లాసిక్ డేస్ లో ఒక వేశ్యా గృహ నిర్వాహకురాలి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ఆలియా ప్రధాన పాత్రలో నటించారు.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల బాలీవుడ్ లో 25 సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసుకున్నారు భన్సాలీ. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరమండితో డిజిటల్ అరంగేట్రం చేయడానికి కళాత్మక చిత్రాల దర్శకుడు భన్సాలీ సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం హీటెక్కిస్తోంది. ఈ భారీ సిరీస్ లాహోర్ (ప్రస్తుత పాకిస్తాన్)లో స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. హీరా మండి సిరీస్ కోసం భన్సాలీ కొందరు అగ్ర కథానాయికలను ఎంపిక చేయనున్నారని కథనాలొస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ బచ్చన్- మాధురీ దీక్షిత్- దీపికా పదుకొణె- పరిణీతి చోప్రా- మనీషా కొయిరాలా- విద్యాబాలన్ తదితర పేర్లు జాబితాలో వినిపిస్తున్నాయి.
అయితే హీరామండిలో అవకాశం ఇస్తే తాను ఉచితంగా నటిస్తానని ఆలియా భట్ దర్శకుడు భన్సాలీకి చెప్పారట. హీరా మండిలో తనకు ఏదైనా పాత్ర ఇవ్వమని భన్సాలీని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గంగూభాయిగా తనని ఆవిష్కరించిన గురూజీకి ఉచిత ఆఫర్ ని ఇచ్చిందట. అయితే ఆలియా ఆఫర్ ను భన్సాలీ వెంటనే తిరస్కరించడమే గాక.. తన మార్కెట్ రేంజుకు తగ్గ పారితోషికం చెల్లిస్తానని తనకు ఓ రోల్ ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మాతలు ఆలియాకు అలాగే ఇతర తారలకు అందాల్సిన పారితోషికాన్ని చెల్లిస్తారని వెల్లడించారట.
హీరమండి వెబ్ సిరీస్ లో ఏడు ఎపిసోడ్ లు ఉంటాయి. భన్సాలీ మొదటి ఎపిసోడ్‌కు దర్శకత్వం వహిస్తారు. మిగిలిన ఆరు ఎపిసోడ్ లకు భసాలి పర్యవేక్షణలో విభూ పూరి దర్శకత్వం వహించనున్నారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. ``సంజయ్ లీలా భన్సాలీ హీరమండి నెట్ ఫ్లిక్స్ లో వస్తున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ హిస్టారికల్ పౌరాణిక ఒరిజినల్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నందుకు మేము ఎంతగా సంతోషిస్తున్నామో వివరించడానికి పదాలు సరిపోవు. కానీ ఈ ఎమోజీలు మా ఆనందాన్ని సూచిస్తున్నాయి.. అంటూ కొన్ని ఈమోజీలను షేర్ చేశారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అలియా భట్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆర్.ఆర్.ఆర్ సహా గంగుబాయి కాతియావాడి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా` రోడ్ ట్రిప్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్ - కత్రినా కైఫ్ తో పాటు ఆలియా భట్ కూడా నటించనుంది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఆలియా స్వీయనిర్మాణంలోని డార్లింగ్స్ లో కూడా ఆమె నటించనుంది.