Begin typing your search above and press return to search.

మా ఇంట్లో ప్రతి గదిలోనూ టీవీ ఉంది

By:  Tupaki Desk   |   18 July 2015 5:53 AM GMT
మా ఇంట్లో ప్రతి గదిలోనూ టీవీ ఉంది
X
నాన్న న్యూస్‌ చూస్తారు. నేను థ్రిల్లర్‌ సినిమాలు, రియాలిటీ షోలు చూస్తాను. చెల్లికి సైంటిఫిక్‌ సినిమాలంటే ఇష్టం. అమ్మ లైట్‌ షోస్‌ చూస్తుంది. అందుకే మా ఇంట్లో ప్రతి గదిలోనూ ఓ టీవీ ఉంటుంది అని చెబుతోంది బాలీవుడ్‌ హాట్‌ గాళ్‌ ఆలియాభట్‌.

ఎవరి ఇష్టాల్ని ఎవరూ కాదని అనం. అలాగే ఏదైనా సూటిగా మాట్లాడుకుంటాం. ఒకరికొకరం అబద్ధాలు చెప్పుకోవడం, ఫేక్‌ గా మాట్లాడుకోవడం అనేది అస్సలు ఉండదు. నాన్నగారు మరీ ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడేస్తారు. నేను కాస్త దాచి పెట్టినా అనర్థం కలిగించే అబద్ధాలు చెప్పను.. అని చెప్పింది. కుటుంబ బంధం, అనుబంధం అన్న టాపిక్‌ గురించి మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది ఆలియా. ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంభ వ్యవస్థ నాశనమైంది. రాజకీయాలు, కుట్రలు కుటుంబాల్లోకి కూడా ప్రవేశించాయి. కాబట్టి ఆలియా తన ఇంట్లోకి అలాంటివాటిని దరిచేరనీయకుండా జాగ్రత్త పడుతోందన్నమాట.

బాలీవుడ్‌ని ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికిప్పుడు ఓ మూడు చిత్రాలతో బిజీగా ఉంది. షాన్‌ దార్‌, ఉడతా పంజాబ్‌, కపూర్‌ సన్స్‌ చిత్రాల్లో నటిస్తోంది. అంతే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌ గా కూడా ఉంది.