Begin typing your search above and press return to search.

కేట్ అండ్ భట్ జోకులేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:02 AM GMT
కేట్ అండ్ భట్ జోకులేసుకుంటున్నారు
X
మన దగ్గర సినిమా హీరో హీరోయిన్లు టీవీల్లో కనిపించాలంటే.. వాళ్ల సినిమా ప్రమోషన్ దగ్గరలో ఉన్నపుడే వస్తుంటారు. టీవీ షోలు పెరిగిన తర్వాత.. కొందరు సెలబ్రిటీలు వాటికి కూడా వస్తున్నారు కానీ.. అది మరో వారంలోనే రెండు వారాల్లోనే వారి సినిమా రిలీజ్ ఉంటేనే ఇలా చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో పరిస్థితి ఇలా కాదు.

ఓ బ్యూటీ నేహా ధూపియా యాంకర్ గా.. వోగ్ బీఎఫ్ ఎఫ్ అనే ఛాట్ షో నిర్వహిస్తోంది. దీనికి మరో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు కలిసి వచ్చేశారు. ఆఫ్ స్క్రీన్ లో మంచి స్నేహితులు అయిన కత్రినా కైఫ్.. ఆలియా భట్.. ఇద్దరూ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. కబుర్లు చెప్పుకుంటూ.. జోకులు వేసుకుంటూ అలరించారు. ఒకరిపై ఒకరు కామెడీ చేసుకునేందుకు కూడా వెనకాడలేదు. ఎంతసేపూ ఫిజిక్ కోసం జిమ్ లో గడిపేయడమేనా అని కత్రినాను ప్రశ్నించిన ఆలియా భట్.. ఇక వర్కవుట్స్ మానేది బాయ్ ఫ్రెండ్ ను చూసుకుని లైన్ లో పెట్టమంటూ సలహా ఇచ్చేసింది. యంగ్ జనరేషన్ బ్యూటీనే ఇంత స్పీడ్ చూపిస్తే.. సీనియర్ సుందరాంగి కేట్ తానేం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంది.

నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ కత్రినా చేసిన కామెంట్ హైలైట్ అయింది. అయితే ఎవరిని చేసుకోవాలో మాత్రం చెప్పలేదు. కేట్ ఎక్కడకీ సరయిన సమయం రాకపోవడం ఒక్కటే.. ఆమెలో తనకు నచ్చని విషయం అంటోది ఆలియా.