Begin typing your search above and press return to search.

పెళ్లయినట్లే లేదు.. ఆలియా అక్కడ నేనిక్కడ

By:  Tupaki Desk   |   14 Jun 2022 1:30 AM GMT
పెళ్లయినట్లే లేదు.. ఆలియా అక్కడ నేనిక్కడ
X
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఏప్రిల్ 14న హిందు సాంప్రదాయం ప్రకారం వారి స్వగృహంలోనే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక వీరికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా బిజీగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక రణ్ బీర్ కపూర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశాడు. పెళ్లి జరిగి నెల రోజులు అయ్యిందని అయితే ఇప్పటివరకు తమకు పెళ్లి అయినట్లు ఫీలింగ్ కూడా కలగడం లేదని రణ్ బీర్ చెప్పాడు.

పెళ్లికి ముందు ఐదేళ్ల ప్రేమ ప్రయాణంలో ఉన్నామని అయితే పెళ్లి చేసుకోవాలని కూడా ఎప్పుడో అనుకున్నాము అని అయితే పెళ్లి తరువాత మరుసటి రోజే ఎవరి షూటింగ్ కి వారు వెళ్లిపోయాము అని అన్నాడు. ఇక ఆలియా లండన్ నుంచి తిరిగి రాగానే అలాగే శంషేరా విడుదల కాగానే, ఒక వారం సెలవు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతూ.. అసలు మాకు పెళ్లయిందని ఇప్పటికీ నాకు నమ్మకం కుదరడం లేదు.. అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు నచ్చిన విధంగా ఆలియా అడుగులు వేస్తోందని తనకు మాత్రం వచ్చిన పని చేసుకుంటూ ఇక్కడ ఉండడమే హ్యాపీగా ఉందని అన్నారు. ఇక రణ్ బీర్ ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ఈ ఎడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. నాగార్జున అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి సమర్పణలో భారీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.