Begin typing your search above and press return to search.
మామ అంత్యక్రియల్లో RRR ఆలియా చేసిన తప్పు?
By: Tupaki Desk | 1 May 2020 4:45 AM GMTఓవైపు మామ అంత్యక్రియలు.. మరోవైపు జరగాల్సిన కార్యక్రమం కోసం ఆయన గారి కొడుకులో టెన్షన్.. ఆ సమయంలో కాబోయే కోడలు ఏం చేసిందో తెలుసా? ఫోన్ లైవ్ లో చాట్ చేసింది. వాతావరణం అంతగా వేడెక్కి ఉన్న చోట ఆ యాక్టివిటీ ఎంతో అసహజంగా కనిపించింది. ఫలితం కూడా వెంటనే రిఫ్లెక్ట్ అయ్యింది. అది కూడా నెటిజనుల రూపంలో. ఎవరికి వారు అంతర్జాలంలో దూషణలతో ఆడుకున్నారు. ఇదంతా ఎవరి గురించి? అంటే.. ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ గురించే.
నిన్నటిరోజున ఆలియా ప్రియుడు రణబీర్ కపూర్ తండ్రి గారైన రిషీ కపూర్ (67) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్య క్రియల్లో రణబీర్ - ఆలియా పాల్గొన్నారు. వీళ్లంతా చిన్న పిల్లల్లా కంట తడి పెట్టుకుని కాస్త బిగ్గరగానే ఏడ్చేసిన దృశ్యాలు హృదయాల్ని ద్రవింపజేసాయి. అయితే సడెన్ గా ఏమైందో ఆలియా చేతిలో ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. ఇంతకీ ఎవరితో మాట్లాడింది అంటే తండ్రి కడసారి చూపు కోసం ఎంతో పరితపించిపోతూ అంత్యక్రియలకు రాలేకపోయిన రిషీజీ కుమార్తె రిద్ధిమతో ఫోన్ సంభాషణ సాగించింది. అది కూడా ఆలియా తన ఫోన్ లో హిందూ సాంప్రదాయ విధానంలో అంత్యక్రియలు ఎలా చేస్తారో రిద్ధిమకు ఓ వీడియో లైవ్ గా తనకు చూపించిందట. రిషీజీ అంత్యక్రియలు ప్రారంభం కాకముందే ఈ పని చేసింది.
ఆ క్షణం ఎంతో ఉద్వేగానికి గురైనా రిద్ధిమ.. ``పాపా నన్ను క్షమించు. అక్కడికి రాలేకపోతున్నాను. వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను`` అని కంట నీరు పెట్టుకుంది. ``పాపా ఐ లవ్ యు.. ఐ విల్ ఆల్వేస్ లవ్ యు.. రెస్ట్ ఇన్ పీస్.. నా వారియర్ నిన్ను మిస్సవుతున్నా. ఇక ఎప్పటికీ నీతో ముఖాముఖి కాల్ మాట్లాడలేను.. నేను నీ దగ్గరకు (అంత్యక్రియలు జరుగుతున్న చోటికి) రాలేకపోతున్నాను. ప్రయత్నిస్తున్నాను`` అంటూ మనోవేదనను వ్యక్తం చేసింది. ఇదంతా ఆలియా ఫోన్ లో జరిగిన సీన్. కానీ అదేమీ తెలియని నెటిజనులు మాత్రం ఆలియా చేసిన పనిని తూర్పారబట్టారు. ఒకరకంగా తనని తిట్టి పోశారు. అయితే అసలేం జరిగిందో తెలీకుండా అసలే కష్టంలో దుఃఖంలో ఉన్నవారిని ఇలా తూలనాడడం సబబేనా? ఇకనైనా నెటిజనులు ఆ వెకిలి వేషం ఆపేస్తేనే మేలేమో! అంటూ సర్ధి చెబుతున్నారు అక్కడ సీనేంటో తెలిసినవారు. రిషీ కపూర్ కుమార్తె రిద్ధిమ ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటున్నారు. విమానాల్లేవ్.. బస్సుల్లేవ్.. లాక్ డౌన్ వల్ల రోడ్ వాయి మార్గాలు మూత పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తండ్రి కడసారి చూపునకు నోచుకోలేని ధైన్యం నెలకొంది. అందుకే తనని సముదాయించేందుకే ఆలియా ఫోన్ చేసిందన్నమాట.