Begin typing your search above and press return to search.

వీడియో: హాట్ ల‌వ‌ర్స్ ని క‌రోనా క‌లిపిందా?

By:  Tupaki Desk   |   29 March 2020 5:10 AM GMT
వీడియో: హాట్ ల‌వ‌ర్స్ ని క‌రోనా క‌లిపిందా?
X
బాలీవుడ్ హాట్ ల‌వ‌ర్స్ అలియా భట్ -రణబీర్ కపూర్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? ఇంత‌కీ క‌లిసే ఉన్నారా? విడిపోయారా? గ‌త కొంత‌కాలంగా ఈ జంట మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని.. గొడ‌వ‌ల‌తో విడిపోయార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మొన్న ఆలియా బ‌ర్త్ డే రోజున ర‌ణ‌బీర్ ముఖం చాటేయ‌డం వెన‌క ఇంకేదో గ‌డ‌బిడ ఉందంటూ ప్ర‌చార‌మైపోయింది. అయితే ఆ త‌ర్వాత అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేస్తూ ఈ జంట సోష‌ల్ మీడియాల్లో క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా విడిపోలేదు! అంటూ క్లూ ఇచ్చింది.

దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2020లో పెళ్లి జ‌రుగుతుంద‌ని అనుకుంటే ఇలాంటి ప్ర‌చారం సాగ‌డంపై ఖంగు తిన్నారంతా. ఎట్ట‌కేల‌కు ఈ జంట మ‌రోసారి క‌లిసే ఉన్నామ‌నే ప్రూఫ్ ని అభిమానుల కోసం అంత‌ర్జాలంలో వ‌దిలారు. ర‌ణ‌బీర్ - ఆలియా జంట ప్ర‌స్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ సమయంలో వారిద్దరూ కలిసే ఉన్నారు. ఈ జంట‌ కలిసి ఉన్న‌ వీడియో ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ స‌న్నివేశం ఉండ‌డంతో ఈ జంట పంట పండిన‌ట్టేనంటూ జోకులు పేల్తున్నాయ్.

తాజా వీడియోలో రణబీర్- ఆలియా.. వెంట ఒక కుక్క వాకింగ్ చేస్తోంది. చాలా సాధా సీదాగా సాధారణ దుస్తుల్లో ఆ ఇద్ద‌రూ న‌డుచుకుంటూ వెళుతున్నారు. ఇక ఆలియా - ర‌ణ‌బీర్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ కి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. డిసెంబ‌ర్ 4న సినిమా రిలీజ్ కానుంది. ఆలియా ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి