Begin typing your search above and press return to search.
ప్రేమ జంట పెళ్లికి రెడీ
By: Tupaki Desk | 21 Jun 2018 11:01 AM GMTబాలీవుడ్ లోని యంగ్ జనరేషన్ లో బెస్ట్ యాక్టర్లలో గ్యారంటీగా రణ్ బీర్ కపూర్ పేరు ముందే ఉంటుంది. యాక్టింగ్ పరంగానే కాదు... హీరోయిన్లతో రిలేషన్ మెయిన్ టెయిన్ చేయడంలోనూ రణ్ బీర్ పేరు ముందే ఉంటుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపికా పదుకునే.. కత్రినా కైఫ్ లతో ఇతడి ప్రేమాయణంపై చాలానే గాసిప్స్ వచ్చాయి. దీపికాతో అతడి పేరు గాసిప్ కాలమ్ లో లెక్కలేనన్ని సార్లు కనిపించింది.
ప్రస్తుతం రణ్ బీర్ బాలీవుడ్ టాప్ బ్యూటీ ఆలియా భట్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఆమెతో పబ్లిక్ గానే చెట్టపట్టాలు వేసి తిరుగుతున్నాడు. ఈసారి అతడు తన మనసులోని ప్రేమను దాచుకోవడం కూడా లేదు. రణ్ బీర్ - ఆలియా సినిమాల పరంగా బోలెడు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. వీటన్నింటిని పూర్తి చేసుకుని వచ్చే ఏడాది చివరికి ఒకటవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రణ్ బీర్ లేటెస్ట్ సినిమా సంజూ ప్రమోషన్ ఈవెంట్లలో ఆలియా గురించి అడిగితే ఆమె పట్ల నా మనసులో ఉన్న భావాన్ని చెప్పాలంటే కొత్త పదం కనిపెట్టాలి అంటూ తన ఫీలింగ్ చెప్పాడు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రణ్ బీర్ - ఆలియా జంటగానే కలిసి తిరిగారు. అప్పటి నుంచి బాలీవుడ్ మీడియాలో వీళ్ల పెళ్లి కబురు జోరుగానే వినిపిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ అభిమాని మీ పెళ్లెప్పుడు ఉంటుందని రణ్ బీర్ ను అడగ్గా త్వరలోనే ఉంటుంది అంటూ ఆన్సరిచ్చాడు. వీళ్లిద్దరి పెళ్లికి రెండు వైపుల ఫ్యామిలీలు సుముఖంగానే ఉన్నాయనేది బాలీవుడ్ మీడియా కథనం.