Begin typing your search above and press return to search.
చివరికి నువ్వు కూడా బ్రేకప్పా తల్లీ...
By: Tupaki Desk | 23 April 2016 1:30 PM GMTబాలీవుడ్లో గత రెండేళ్లుగా బ్రేకప్ మేళా నడుస్తోంది. భార్యా భర్తలు.. ప్రేమికులు.. విడిపోవడానికి పోటీలు పడుతున్నారు. ఆల్రెడీ హృతిక్ రోషన్-సుజానే ఖాన్.. ఫర్హాన్ అక్తర్-అధునా.. రణబీర్ కపూర్-కత్రినా కైఫ్.. అర్బాజ్ ఖాన్-మలైకా అరోరా.. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇంకా మరికొన్ని జంటలు కూడా ‘తలాక్’ చెప్పేసుకున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి ఓ యువ జంట వచ్చి చేరుతోంది. బాలీవుడ్లో ముచ్చటైన పెయిర్ గా జగుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్-సిద్ధార్థ్ మల్హోత్రా కూడా బ్రేకప్ బాటలో నడుస్తున్నట్లు సమాచారం.
కొన్ని రోజుల కిందటే ఆలియా-సిద్దార్థ్ కలిసి బీచ్ లో ఓ హాట్ హాట్ ఫొటో షూట్ కూడా చేశారు. వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి కెమిస్ట్రీ ఉందో ఆ సందర్భంగా అందరికీ బాగా అర్థమైంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సైతం సిద్దార్థ్ కు, తనకు మధ్య ఏదో నడుస్తోందని తమాషా చేసింది ఆలియా. కరణ్ జోహార్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వీళ్లిద్దరూ తొలి సినిమా షూటింగ్ టైంలోనే ప్రేమలో పడిపోయారు. బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ ప్రేమ గురించి బయటి ప్రపంచానికి చెప్పడానికి మొహమాట పడలేదు. వీళ్లిద్దరూ భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకుంటారని అనుకుంటుంటే.. ఉన్నట్లుండి బ్రేకప్ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఓ పార్టీ సందర్భంగా ఇద్దరికీ గొడవ జరిగి.. బ్రేకప్ దిశగా వెళ్లినట్లు సమాచారం.