Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్.. మమ్మీ చేతిలో కీలు బొమ్మ?
By: Tupaki Desk | 7 Oct 2022 4:04 AM GMTసినీరంగంలో విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. అందాల కథనాయికలు కోట్లలో ఆర్జిస్తున్నా తమ ఆర్థిక వ్యవహారాలన్నిటినీ తాము ఎంతగానో నమ్మే తల్లిదండ్రులకో లేక మేనేజర్ కో అప్పజెబుతారు. దాని పర్యవసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. మహానటి సావిత్రి తన జీవితంలో ఆస్తులన్నిటినీ కోల్పోవడానికి కారణం నమ్మినవారికి అప్పగించడమేనని చెబుతారు. చాలా మంది సీనియర్ నాయికలు తమ ఆర్థిక వ్యవహారాల్ని పట్టించుకోకపోవడంతో చివరిలో చాలా నష్టపోవాల్సి వచ్చింది. కొందరి విషయంలో ఆస్తి తగాదాలు బయటపడ్డాయి.
మమ్మీ కాబోయే అలియా భట్ ఇటీవల తన తల్లి సోని రజ్దాన్ ఇప్పటికీ తన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటుందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. 2012 నుండి నటిగా కొనసాగుతున్న ఆలియా తన ఆర్థిక వ్యవహారాలన్నిటినీ తన తల్లిగారే చూస్తారట. ఇటీవలి ఓ ఇంటరాక్షన్ లో ఆలియా మాట్లాడుతూ తన ఆర్థిక వ్యవహారాలను తానే స్వయంగా నిర్వహించనందున తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తనకు తెలియదని వెల్లడించింది. ఎంత డబ్బు ఉందో సంఖ్యలను అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు తన బృందంతో కూర్చుని చర్చిస్తానని అలియా పేర్కొంది. తనకు ఆర్థిక విషయాల గురించి ఒక నిర్దిష్ట ఆలోచన ఉందని అయితే తన తల్లి దానిని చాలా బాగా నిర్వహిస్తుందని కూడా తెలుసునని తెలిపింది. డబ్బుతో తనకున్న సంబంధం 'దానిని సంపాదించుకోవడం వరకే''. తన తల్లిగారైన సోనీ రజ్దాన్ దానిని నిర్వహించడానికి అనుమతించాను అని వెల్లడించింది.
త్వరలోనే మామ్ కాబోతున్న ఆనందం:
ఆలియా భట్ త్వరలోనే మామ్ కాబోతోంది. ఇటీవలే ఆలియా బేబీ షవర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. రణబీర్ తల్లి నీతూ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో అలియా బేబీ షవర్ ఈవెంట్ నుండి ఫోటోలు వీడియోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో రణబీర్ తో పాటు అలియా భట్- నీతూ కపూర్- కరిష్మా కపూర్- శ్వేతా బచ్చన్- అలియా తల్లి సోనీ రజ్దాన్- నితాషా నందా- రిమా జైన్- అనిస్సా మల్హోత్రా హైన్ - షమ్మీ కపూర్ భార్య నీలా దేవి తదితరులు ఉన్నారు. 'బ్లెస్సింగ్స్ ఎన్ థాంక్స్'' అనే క్యాప్షన్ తో నీతూ కపూర్ మరో ఫోటోని షేర్ చేసింది. అందులో రణబీర్ - కరిష్మా - రిమా జైన్ తదితరులు ఉన్నారు. రిద్ధిమా ఇన్ స్టాగ్రామ్ లో బేబీ షవర్ నుండి ఫోటోలను షేర్ చేసి 'మమ్మీ టు బి' .. 'డాడీ టు బి' అని క్యాప్షన్ ఇచ్చింది.
వరుస బ్లాక్ బస్టర్లతో భారీ ఆర్జన
ఈ ఏడాదిలో ఆలియా నాలుగు బ్లాక్ బస్టర్లలో నటించింది. గంగూబాయి కతియావాడి- డార్లింగ్స్- RRR- బ్రహ్మాస్త్రలో భాగమైంది. మరోవైపు సోషల్ మీడియాల ద్వారా ఆర్జనలోను దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో కూడా ఆలియా రాణిస్తోంది. తను ఇప్పటికే పిల్లల దుస్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆమె కొత్త శ్రేణి ప్రసూతి దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది.
తాజాగా తన మెటర్నల్ వేర్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలియా భట్ తనకు పిల్లలు ఇంకా కలగకపోయినా తన కిడ్స్ వేర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ కి భార్యగా గర్భిణిగా ఉంది. జూన్ 2022 లో తాను మదర్ కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఈ ఆనంద క్షణంలో ఇలా మెటర్నల్ వేర్ వ్యాపారంలోను సత్తా చాటుతోంది. యువతరంలో ఆలియాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బ్రాండ్లు తన వెంట పడుతున్నాయి.
అయితే తన ఆదాయం అంతా తల్లి సోనీ రజ్దాన్ చేతిలోనే ఉన్నా ఆలియా కొన్ని తెలివైన పెట్టుబడులను పెడుతోంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక ప్రముఖ బ్రాండ్ లో పెట్టుబడి పెట్టింది. తన సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించడమే గాక... ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది. ఆ రకంగా ఇతర నాయికలతో పోలిస్తే ఆలియా కొంచెం తెలివిగానే ఆలోచించిందని చెప్పాలి. కోట్లాది రూపాయల పారితోషికాలను అందుకోవడమే కాదు.. వాటిని సవ్యరీతిలో పెట్టుబడులుగా మార్చడం కూడా ఈ రంగంలో అవసరం అని నిరూపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవలే అయాన్ ముఖర్జీ 'బ్రహ్మాస్త్ర'లో రణబీర్ కపూర్ తో కలిసి నటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించింది. తదుపరి కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'... గాల్ గడోట్ తో 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రాల్లో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.