Begin typing your search above and press return to search.

ఆలియా భట్ బేబీ షవర్ సంద‌డే సంద‌డి

By:  Tupaki Desk   |   6 Oct 2022 3:41 AM GMT
ఆలియా భట్ బేబీ షవర్ సంద‌డే సంద‌డి
X
త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ అంద‌చందాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకుంది ఆలియా భ‌ట్. కెరీర్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఈ ఒక్క ఏడాదిలో వ‌రుస‌గా మూడు విజ‌యాలు అందుకుని అజేయంగా కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్- గంగూభాయి క‌థియావాడి- డార్లింగ్స్ చిత్రాల్లో ఆలియా న‌టించింది. ఇవ‌న్నీ ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇదే ఏడాది త‌న భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్ తో క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ చెబుతోంది.

వీట‌న్నిటినీ మించి ఆలియా ఇప్పుడు వేరొక సెల‌బ్రేష‌న్ లో ఆనందోత్సాహంలో తేలియాడుతోంది. ఆలియా భట్ త్వ‌ర‌లోనే మామ్ కాబోతోంది. నిన్న‌టి సాయంత్రం ఆలియా బేబీ షవర్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. రణబీర్ తల్లి నీతూ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో అలియా బేబీ షవర్ ఈవెంట్ నుండి ఫోటోలు వీడియోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

ఈ ఫోటోల్లో ర‌ణబీర్ తో పాటు అలియా భట్- నీతూ కపూర్- కరిష్మా కపూర్- శ్వేతా బచ్చన్- అలియా తల్లి సోనీ రజ్దాన్- నితాషా నందా- రిమా జైన్- అనిస్సా మల్హోత్రా హైన్ - షమ్మీ కపూర్ భార్య నీలా దేవి త‌దిత‌రులు ఉన్నారు.

'బ్లెస్సింగ్స్ ఎన్ థాంక్స్'' అనే క్యాప్షన్ తో నీతూ కపూర్ మ‌రో ఫోటోని షేర్ చేసింది. అందులో రణబీర్ - కరిష్మా - రిమా జైన్ త‌దిత‌రులు ఉన్నారు. రిద్ధిమా ఇన్ స్టాగ్రామ్ లో బేబీ షవర్ నుండి ఫోటోలను షేర్ చేసి 'మమ్మీ టు బి'.. 'డాడీ టు బి' అని క్యాప్షన్ ఇచ్చింది.

వివాహ వేడుక జ‌రిగిన చోటే ఈ సంద‌డి..!

అలియా భట్ -రణబీర్ కపూర్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆనంద క్ష‌ణాలివి. తమ తాజా చిత్రం బ్రహ్మాస్త్ర విజయం సాధించ‌డం ఈ జంట‌కు ఆనందోత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇంత‌లోనే బుధవారం నాడు బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ బేబీ షవర్ కోసం ఈ జంట ముంబైలోని 'వాస్తు' గృహానికి వచ్చారు. ఇక్కడే ఈ జంట వివాహం చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి బ్రహ్మాస్త్ర కు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ కూడా హాజరయ్యారు. ఆలియా సన్నిహితులు అనుష్క రంజన్- ఆకాంక్ష రంజన్ కూడా హాజరయ్యారు. అలియా భట్ స్నేహితురాలు ఆకాన్షా రాంజాన్ క‌పూర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ కథనాలలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.