Begin typing your search above and press return to search.
అందాలన్నీ పోగేసి చెక్కిన శిల్పమా.. ఈ సుందరి!
By: Tupaki Desk | 29 May 2020 2:00 PM GMTప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని బిజీ హీరోయిన్లలో యంగ్ బ్యూటీ అలియా భట్ ఒకరు. అలియా చేతిలో ప్రస్తుతం అన్నీ పెద్ద సినిమా ప్రాజెక్టులే ఉన్నాయట. ఈ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది ఈ సోయగాల చిన్నది. తను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ లాక్ డౌన్ ముందే అడ్జస్ట్ చేసిందట. కానీ ఇప్పుడు ఇచ్చిన డేట్స్ అన్నీ వృధా అయినట్లే అని అర్ధమవుతుంది. ఎందుకంటే షూటింగ్స్ జరిగితే ఎక్కడి వారు అక్కడే అన్నీ పనులు పూర్తిచేసేవారు. కానీ కరోనా దెబ్బ ఇప్పట్లో మానేలా కనిపించడం లేదు. అలియా ఆర్ఆర్ఆర్ తో పాటు ఒప్పుకున్న అన్నీ సినిమాల కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి నానా తంటాలు పడుతుందట. ఇదివరకే పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ఆర్ షెడ్యూల్.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తుంది. మే నెలలో పూణే షెడ్యూల్ జరగనుందని అప్పట్లో చెప్పారు. కానీ నో ఛాన్స్. ప్రస్తుతం అలియా చేతిలో కరణ్ జోహార్ - బ్రహ్మాస్త్ర, సడక్ 2, తఖ్త్, సంజయ్ లీల భన్సాలీ గంగూభాయ్ కత్వాడియా చిత్రాలు ఉన్నాయి.
సంజయ్ లీల భన్సాలీ ఇప్పటికే అలియా డేట్స్ కోసం ఆతృతగా పోటీ పడుతున్నాడట. అన్నీ పెద్ద సినిమాలే. ఇక ప్రస్తుతం ఇండియాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను బాహుబలిని చెక్కిన జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆయనకు తోడుగా అలియా భట్ నటించనుంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభిస్తారట. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అలియా ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అలియా ఎంతో స్టైలిష్ గా చెక్కిన శిల్పంలా ఉంది. ఆమెను చూసినవారు ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. గోల్డ్ దుస్తులు ధరించిన అలియా.. ఆ దుస్తులలో గోల్డ్ లాగే కనిపించడం విశేషం. మరి ప్రస్తుత పెద్ద సినిమాలు అన్నిటికీ అలియా డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి!