Begin typing your search above and press return to search.

బ్రిట్నీస్ఫియ‌ర్స్ బెండు తీసిన‌ట్టుగా!

By:  Tupaki Desk   |   4 Feb 2019 9:01 AM GMT
బ్రిట్నీస్ఫియ‌ర్స్ బెండు తీసిన‌ట్టుగా!
X
జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్చు గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ..
బ్రిట్నీ స్పియ‌ర్స్ కి ప్రింట్ తీసినట్టుగా ఉందిరో..ఈ కాడ్బరీ..
నడుమే చుస్తే షకీరా .. దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీ రా ..
నడకే చుస్తే బియాన్సే... , బేబీ నవ్విందంటే ఖల్లాసే ..
జీన్స్ ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గున్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా ..
జెన్నిఫ‌ర్ లోపెజ్ స్కెచ్చు గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుంద‌రి
బ్రిట్నీస్పియ‌ర్స్ బెండు తీసిన‌ట్టుగా ఉందిరో ఈ క్యాడ్బ‌రీ..

`జ‌ల్సా` సినిమాలోనిది ఈ పాట‌. ఇలియానా, పార్వ‌తి మెల్ట‌న్ లాంటి ముద్దుగుమ్మ‌ల్ని చూశాక ప‌వ‌ర్‌ స్టార్ అంత‌టివాడే అలా కాళిదాసు అయిపోయాడు. ఇదిగో ఇక్క‌డ ఇంచుమించు అంతే రెబ‌ల్ గా క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. ఆలియా జాలియా చెలియా .. నువ్వు కుర్ర‌కారు గుండెల్లో అణుబాంబువా..! అంటూ గ‌ల్లీ టు డిల్లీ బోయ్స్ అంతా క‌వులైపోతున్నారు. ఆలియావా? అస‌లు నీవు.. జెన్నిఫ‌ర్ లోపెజ్‌వా? అంటూ ఒక‌టే తెగ ఇదైపోతున్నారు. పాప్ స్టార్.. ర్యాప్ స్టార్.. రాక్ స్టార్ .. స్టార్ ఎవ‌రైనా ఈ అమ్మ‌డి ముందు దిగ‌దుడుపే!!

అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేష్ భ‌ట్ వార‌సురాలిగా సినీరంగంలో ప్ర‌వేశించిన ఆలియా భ‌ట్ ఇంతింతై అన్న చందంగా పెద్ద స్టార్ గా ఎదిగేసింది. రాజీ సినిమాతో 100కోట్ల క్ల‌బ్ నాయిక‌గా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ యంగ్ బ్యూటీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. త్వ‌ర‌లోనే తాను ప్రేమించిన ల‌వ‌ర్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం ఉంది. లేటెస్టుగా ఆలియా ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో పాప్ ప్రపంచాన్ని ఏలిన టాప్ స్టార్స్ బ్రిట్నీ స్పియ‌ర్స్, లేడీ గాగ‌, జెన్నిఫ‌ర్ లోపెజ్ రేంజులో క‌నిపించింది ఈ యంగ్ బ్యూటీ. బ్లాక్ & వైట్ స్ట‌న్నింగ్ కాంబినేష‌న్ డ్రెస్ లో మ‌తి చెడ‌గొట్టింది. కెరీర్ ప‌రంగా చూస్తే.. ఆలియా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. క‌ళాంక్, బ్ర‌హ్మాస్త్ర‌, గ‌ల్లీబోయ్ చిత్రాల్లో ఈ అమ్మ‌డు న‌టిస్తోంది. ఇవన్నీ 2019-20 సీజ‌న్‌లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పుడున్న స్టార్స్ లో ఇండియా బెస్ట్ యంగ్ హీరోయిన్ గా వెలిగిపోతోంది ఈ అమ్మ‌డు.