Begin typing your search above and press return to search.

అందాలు భామ హలో అని పిలుస్తోంది

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:21 AM GMT
అందాలు భామ హలో అని పిలుస్తోంది
X

షాన్ దార్ పోరీ ఆలియా భట్.. బాగా చలాకీ. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోను అమ్మడి జోరును తట్టుకోవడం కష్టం. ఈ పిల్ల స్పీడ్ ను రీచ్ కావడం చాలామందికి సాధ్యం కావడం లేదు కూడా. కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న ఈ భామ.. కాన్సెప్ట్ ఏదైనా జోరు మాత్రం తగ్గించదు. గతేడాది షాన్ దార్ నిరుత్సాహపరిచాక రీసెంట్ గా కపూర్ అండ్ సన్స్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది ఆలియా.

అదే జోష్ తో మేగజైన్ కవర్ పేజ్ లకు పోజులు ఇచ్చేస్తోంది. ఇప్పుడు హెలో మేగజైన్ జూన్ ఎడిషన్ పై తళ్లుక్కుమంటోంది ఆలియా భట్. ఈ కవర్ పేజ్ పై ఆలియా ఎంత సింపుల్ గా ఉందంటే.. ఇంత సింపుల్ గా ఇంత గ్లామర్ చూపించచ్చా అనిపించేస్తోంది. క్లీవేజ్ కనిపించేలా లోనెక్ ఇన్నర్ వేర్.. పైన అలా అలా భుజాలపై తగిలించిన టాప్.. స్ట్రైప్స్ డిజైన్ తో బాటమ్.. చెప్పడానికి సింపులే అయినా.. ఈ డ్రసింగ్ కి ఇంత కలరింగ్ వచ్చిందంటే.. అది కుర్ర హీరోయిన్ కళ్లలోను, బాడీలోను ఉన్న మెరుపులే కారణం.

అందాలతో వలవేసే ఈ సుందరాంగి.. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ యాటిట్యూడ్ తో చూస్తూ ఉంటుంది. రీసెంట్ గా లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్ లపై తన్మయ్ భట్ స్నాప్ చాట్ వివాదంపై డిఫరెంట్ గా స్పందించింది ఆలియా. 'తన్మయ్ లోని హ్యూమర్ యాంగిల్ ని చూడకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం ఏంటో' అందోంటి ఆలియా.