Begin typing your search above and press return to search.
RRR బ్యూటీ కళ్లు చెదిరే విన్యాసం
By: Tupaki Desk | 18 March 2019 8:58 AM GMTఎస్.ఎస్.రాజమౌళి అంతటివాడే ``నీ రాక కోసం.. నీ నటన చూసేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా`` అన్నారంటే అర్థం చేసుకోవాలి. ఎంతో మ్యాటర్ ఉంటే కానీ - అంతటి దిగ్గజం నుంచి ఆ ప్రశంస దక్కుతుందా? కానీ అలాంటి పొగడ్త అందుకున్న ఏకైక తారగా బాలీవుడ్ యువకథానాయిక ఆలియాభట్ పేరు మార్మోగిపోతోంది. దీపిక - కత్రిన తర్వాత ఆ రేంజు స్టార్ గా ఈ భామ కితాబు అందుకుంటోంది. సినీనేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఆలియా ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తూ సౌత్ లోనూ అభిమానుల్ని సంపాదించుకోబోతోంది.
ఈ శుభ సందర్భంలోనే ఆలియా నటించిన భారీ మల్టీస్టారర్ `కళాంక్` రిలీజ్ కి రెడీ అవుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో భాగస్వాముల్ని కలుపుకుని దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈలోగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాల్ని - పోస్టర్లను నిరంతరం రిలీజ్ చేస్తూ వేడి పెంచుతున్నారు. ఇప్పటికే కాస్టింగ్ లో ఆలియా భట్ - మాధురి ధీక్షిత్ - సోనాక్షి సిన్హా - వరుణ్ ధావన్ - సంజయ్ దత్ వంటి స్టార్ల పోస్టర్లను రిలీజ్ చేశారు. వీటికి అభిమానుల నంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా `ఘర్ మోర్ పర్ దేసియా ..` అంటూ సాగే ఓ మెలోడీ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆలియా కథక్ నృత్యం మైమరిపిస్తోంది. నాటి రోజుల్లో నర్తకులను తలదన్నేలా.. క్లాసిక్ క్వీన్ మాధురి ధీక్షిత్ అంతటి గ్రేట్ డ్యాన్సర్ ముందు ఆలియా ఈ స్థాయిలో ప్రదర్శన చేసిందంటే విస్మయం కలిగించక మానదు. ఇక ఆ పాటను తెరకెక్కించిన యాంబియెన్స్ విజువల్ రిచ్ నెస్ తో భన్సాలీ సినిమాల్ని గుర్తు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత ఆ మేరకు కళాంక్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారని అర్థమవుతోంది. వర్మన్ అందించిన సంగీతం అంతే ఇంప్రెస్సివ్ గా ఉంది. కళాంక్ ఓ అద్భుతమైన ప్రేమకథా చిత్రమని.. కులాంతర ప్రేమను చూపిస్తున్నారని తెలుస్తోంది. దేశ విభజనకు ముందు జరిగిన రాజవంశస్తుల కథాంశం ఇదని ప్రచారం సాగుతోంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి.. `పద్మావత్` తరహాలోనే `కళాంక్` తెలుగు వెర్షన్ రిలీజవుతుందా.. అవ్వదా? అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.