Begin typing your search above and press return to search.

సీత పాత్రపై జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   13 April 2020 6:10 AM GMT
సీత పాత్రపై జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X
రాజమౌళి తన సినిమాలోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యతను కల్పిస్తాడు. కథలో ప్రతి పాత్రను భాగస్వామ్యం చేస్తాడు. అందుకే జక్కన్న సినిమాలో చిన్న పాత్ర అయినా నటించేందుకు స్టార్స్‌ సూపర్‌ స్టార్స్‌ కూడా ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో సీత పాత్రకు గాను ఆలియా భట్‌ ను తీసుకున్న విషయం తెల్సిందే. ఎంతో మంది హీరోయిన్స్‌ ఉన్నా కూడా మీరు ఆలియా భట్‌ ను ఎందుకు తీసుకున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఇద్దరు హీరోలు కూడా చాలా మంచి నటులు. వారిద్దరి పాత్రలతో బ్యాలన్స్‌ చేస్తూ వారి మద్య నటించే అమ్మాయి కావాలి. ఆ పాత్ర కాస్త అమాయకత్వంను కూడా కలిగి ఉండటంతో పాటు మృదు స్వభావి అన్నట్లుగా ఉండాలి. అందుకే ఆ పాత్రకు ఆలియా భట్‌ అయితేనే బాగుంటుందనే అభిప్రాయం తనకు కలిగిందని జక్కన్న పేర్కొన్నారు. నేను అనుకున్న సీత పాత్రలో ఉండాల్సిన లక్షణాలు ఆలియా భట్‌ లో ఉంటాయి కనుక తాను ఆమెను ఎంపిక చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆలియా భట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌. ఆమె డేట్లు దొరకడమే కష్టంగా ఉంది. ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి మరీ జక్కన్న ఈ సినిమాలో నటింపజేస్తున్నాడు. ఆమద్య డేట్లు ఇబ్బందిగా ఉండటంతో సినిమా నుండి ఆలియా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని స్వయంగా ఆలియా క్లారిటీ ఇచ్చింది. కరోన లాక్‌ డౌన్‌ వల్ల సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. లేదంటే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ లో ఆలియా భట్‌ పాల్గొనేది. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే షూటింగ్‌ ప్రారంభించనుండగా ఆ షెడ్యూల్‌ లో ఆలియా పాల్గొననుందో చూడాలి.