Begin typing your search above and press return to search.
నిర్మాతగా ఆలియా ఒక ఆకు ఎక్కువే తింది!
By: Tupaki Desk | 5 Aug 2022 4:39 AM GMTఆలియా భట్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ డమ్ తో ఓ వెలుగు వెలుగుతోంది. ఇంతలోనే కింగ్ ఖాన్ షారూక్ తో కలిసి భాగస్వామ్యంలో నిర్మాతగా తొలి అడుగులు వేస్తోంది. ఆలియా నటించి నిర్మించిన తొలి సినిమా `డార్లింగ్స్` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలతో ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంది. ఓవైపు రణబీర్ కి తొలి సంతానం రూపంలో అపురూపమైన కానుకను ఇచ్చేందుకు సిద్ధమైన ఆలియా భట్ మరోవైపు వృత్తిపరమైన కమిట్ మెంట్లకు ఎలాంటి అన్యాయం చేయడం లేదు.
తాజా ఇంటర్వ్యూలో ఆలియా డార్లింగ్స్ తో పాటు.. మీడియాతో ఇతర వ్యవహారాల గురించి మాట్లాడింది. వ్యక్తిగత జీవితం గురించి విపరీతమైన కవరేజ్ చేసేందుకు మీడియా తపిస్తోందని అలియా ఏకీభవించింది. నా పనిపై మీడియా చాలా దృష్టి కేంద్రీకరించిందని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు రంగుల ప్రపంచం స్వభావం అలాంటిది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక నటిగా లేదా నటుడిగా దీనిని అందరూ సైనప్ చేయాలి.. అని అన్నారు.
కానీ చికాకు కలిగించే ఒక విషయం ఏమంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. ఫేక్ న్యూస్ ని సృష్టించడం వల్లనే నాకు చిరాకు వస్తుంది. కానీ డిజిటల్ గోళంలో దాన్ని నియంత్రించడం కష్టం... అని ఆలియా మీడియాలోని రెండో కోణం గురించి తన అభిప్రాయం తెలిపింది.
ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టడం తనలోని నటిపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆమె పేర్కొంది. డార్లింగ్స్ సెట్స్ లో చాలా కాలం పాటు నిర్మాతగా కాకుండా ఉద్యోగం చేయడానికి అద్దెకు తీసుకున్న నటిలా తిరిగాను అని ఛమత్కరించింది ఆలియా. ``నాలోని నిర్మాత కారణంగా నాలోని నటుడు పెద్దగా మారలేదు.
వాస్తవానికి మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను సెట్స్ పై కేవలం నటిని మాత్రమే. ఆ సినిమా పూర్తయిన తర్వాత నాలోని నిర్మాత అసలు పనికి సిద్ధమైంది`` అని చెప్పారు. ప్రమోషన్ సమయంలో లేదా మూవీ విడుదలకు దగ్గరగా ఉన్న సమయంలో ఒక నిర్మాత హోదాలో అడుగడుగునా సినిమాతో ఉండాలి. ప్రణాళిక వ్యూహరచన పోస్ట్-ప్రొడక్షన్ ను పర్యవేక్షించడం.. ఎడిట్ కట్‌ని ప్రేక్షకులకు అందించే వరకు తనిఖీ చేయడం వగైరా వగైరా ఉంటాయి.. నటిగా నా సినిమాలన్నింటిలో నేను ఎప్పుడూ ఇన్వాల్వ్ అయ్యాను.. కానీ ఈ ప్రాజెక్ట్ నన్ను ఒక అడుగు ముందుకు వేసేందుకు అవకాశం కల్పించింది... అని తెలిపింది.
ఏ సినిమాకి అయినా కాస్టింగ్ చాలా ముఖ్యం. ఆ విషయంలో క్లారిటీగా ఉన్నప్పుడు ప్రతిదీ చక్కగా సాగుతాయి. కాస్టింగ్ డైరెక్టర్లు.. వారి సహాయకుల కృషి దీనికి అవసరం. మొత్తం టీమ్ ని ఒకచోట చేర్చే ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది... అని తెలిపింది. కెమెరా రోల్ చేసినప్పుడు మాత్రమే ఆకస్మికంగా మా పాత్రలలోకి మారతామని మేము సన్నివేశాన్ని ఎలా నిర్మిస్తామో గ్రహిస్తామని కూడా ఆలియా చెప్పింది. డార్లింగ్స్ మూవీ త్వరలో విడుదల కానుంది.