Begin typing your search above and press return to search.
#RRR బ్యూటీ ముంబై నుంచి హైదరాబాద్ కి రాదన్నారుగా
By: Tupaki Desk | 17 Sep 2020 1:00 PM GMTబాలీవుడ్ లో ఆలియా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. అయినా బాహుబలి దర్శకుడైన ఎస్.ఎస్.రాజమౌళిని గౌరవించి ఆర్.ఆర్.ఆర్ కి సంతకం చేసింది. ఈ సినిమాలో అల్లూరి (చరణ్) సరసన సీత గా కనిపించనుంది. ఇక ఆలియా పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉండగా.. కరోనా మహమ్మారీ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈపాటికే రిలీజ్ కావాల్సినది ప్రతిదీ వాయిదా పద్ధతిలోనే సాగుతోంది. ఇక 2021 దసరాకి అయినా వస్తుందా? అంటే ఇప్పటి నుంచే శరవేగంగా పెండింగ్ షూట్ సహా నిర్మాణానంతర పనులు చేయాల్సి ఉంది. ఇకపోతే ఇటీవల మహమ్మారీ సంగతి ఎలా ఉన్నా పెద్ద హీరోలు కూడా సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఆర్.ఆర్.ఆర్ కోసం చరణ్.. ఎన్టీఆర్ కూడా రెడీ అవుతున్నారట. ఈ అక్టోబర్ లో సెట్స్ కెళ్లేందుకు రాజమౌళి బృందం షెడ్యూల్స్ వేయడంతో ఇక వేగంగా చిత్రీకరణలు ముగించి తదుపరి షూటింగులపైనా దృష్టి పెట్టాలని చరణ్ .. తారక్ భావిస్తున్నారట. హీరోలు సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతుంటే ఆలియా ఒక నెల ముందుగానే హైదరాబాద్ వచ్చి షూటింగులో పాల్గొనబోతోందట. అందుకు జక్కన్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక మరోవైపు సీజీ వర్క్ పైనా జక్కన్న పూర్తిగా దృష్టి సారించి పనులన్నీ పూర్తి చేసేస్తున్నారట. 2021 వేసవి నాటికి అన్నిపనులు పూర్తి చేసి రిలీజ్ చేయగలిగితే గొప్పే. థియేట్రికల్ రిలీజ్ సందిగ్ధంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రణాళికలు ఎలా వేస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. అసలు ముంబై బ్యూటీ ఆలియా ఈ కరోనా కల్లోలంలో షూటింగుకి వస్తుందా? అంటూ ఇటీవల కథనాలొచ్చాయి. మొత్తానికి జక్కన్న అండ్ టీమ్ కి ఇది శుభవార్తనే. ఆలియాపై కీలక షెడ్యూల్ ముగించేస్తే ఇకపై ప్రశాంతంగా తమ పనులు తాము చేసుకోవచ్చన్నమాట.