Begin typing your search above and press return to search.

అలియాకు లక్కు లక్కలాగా అంటుకుందే!

By:  Tupaki Desk   |   19 March 2019 1:47 PM GMT
అలియాకు లక్కు లక్కలాగా అంటుకుందే!
X
'ఊపర్ వాలా జబ్ భీ దేతా హై దేతా ఛప్పడ్ ఫాడ్ కే' అనే సామెత హిందీలో చాలా పాపులర్. రఫ్ గా అనువదిస్తే "పైవాడు ఇవ్వడానికి రెడీ అయితే.. ఒకేసారి వరాలన్నీ వర్షంలా కురిపిస్తాడు." ప్రస్తుతం ఈ సామెత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు అతికినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే అలియా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు ఇక ఏ ఇతర బాలీవుడ్ హీరోయిన్ల చేతి సంచుల్లో కూడా లేవు!

అసలు ఒక్క 100 కోట్ల బడ్జెట్ సినిమాలో నటించడమే గొప్ప అనుకుంటే అలియాకు ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. 'బ్రహ్మాస్త్ర'.. 'తఖ్త్'.. 'కళంక్' ఆ మూడు ప్రాజెక్టులు. ఇవి చాలవన్నట్టు రీసెంట్ గా రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ 'RRR' లో హీరోయిన్ గా ఎంపికయింది. అలియా లైనప్ లో ఉన్న అతి భారీ ప్రాజెక్ట్ ఇదే. ఇవి మాత్రమే అయితే ఈ కథను ఆ సామెతతో ఎందుకు మొదలు పెడతాం? ఇవి చాలవన్నట్టు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎంపికయిందట. ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్వయంగా తెలిపాడు. "సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో నేను.. అలియా త్వరలో కలిసి నటిస్తాం" అంటూ సల్లూ భాయ్ ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ 'ఇన్షాల్లా'. సల్మాన్ - సంజయ్ లీలా భన్సాలి కాంబినేషన్ అంటేనే క్రేజీ ప్రాజెక్ట్ కదా? ఇప్పుడు చెప్పండి.. అలియాను లక్కు లక్కలాగా లటుక్కున పట్టుకోవడమే కాదు.. వదిలి వెళ్ళడానికి నిరాకరిస్తోంది.

మీకెవరికైనా దరిద్రం టన్నుల్లో ఉంటే కాస్త ఆలియా అడ్రెస్ సంపాదించి ఏం చేస్తోందనేది సీక్రెట్ గా కనుక్కోండి. ఒకవేళ అందరికీ తెలిసిపోతే ఎలా? ఈ ప్రపంచంలో అందరికీ లక్కు ఉంటే ఇక లక్కుకు విలువ.. ప్రత్యేకత ఏముంటుంది?