Begin typing your search above and press return to search.
అసూయపడేలా ఆ నవ్వేంటి ఆలియా!
By: Tupaki Desk | 31 Aug 2021 5:30 PM GMTనవ్వు నాలుగు రకాలా మేలు. ఎంతగా నవ్వితే అంతగా ఆరోగ్యం. ముఖంలో నవ్వు ఆరోగ్యానికి సింబాలిక్. నవ్వితే ముఖం మరింత ప్రకాశవంతంగాను మారుతుంది. నవ్వుకు ఇన్ని ప్రత్యేకతలున్నాయి. తాజాగా అలియా భట్ నవ్వు చూస్తే అంతకు మించి అనిపిస్తుంది. ఆలియా భట్ క్యూట్ స్మైల్ కి ఎవరైనా అసూయ పడాల్సిందే. అలా ఆకాశం వైపు చూస్తూ స్వేచ్ఛగా హద్దులు చెరిపేసి మరీ నవ్వుతోంది. ఆన్ ది వేలో ఓ బ్రిడ్స్ పై అమ్మడు కారు ఆపి లోకేషన్ ఎంజాయ్ చేస్తూ.. అదే సమయంలో సహచరుల నుంచి జోక్ పేలడంతో ఆలియా ఒక్కసారిగా తలపైకి ఎత్తి పగలబడి నవ్వేస్తోంది.
ఈ ఫోటోలో ఆలియా లైట్ పింక్ స్కర్ట్.. బ్లూ జీన్స్ ధరించింది. చుట్టూ గ్రీనరి.. దూరంగా ఎత్తైన కొండలు..కింద పెద్ద నీటి కొలనుతో బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ ఐకన్ ఆలియా నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో ఈ దృశ్యం ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు కామెంట్లు చేస్తూ అలియా స్మైల్ పిక్ ని మరింత వైరల్ చేస్తున్నారు.
ఇక అలియా భట్ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో `ఆర్.ఆర్.ఆర్` సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రామ్ చరణ్ భార్య సీత పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్ర షూటింగ్ కూడా పూర్తయింది. ఇటీవలే పాటల షూట్ లో కూడా పాల్గొంది. ఇక బాలీవుడ్ లో వరుసగా నాలుగైదు సినిమాలు చేస్తోంది. `బ్రహ్మాస్త్ర` ..`డార్లింగ్స్`.. `రాకీ అవర్ రానీకీ ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. వీటితో పాటు భన్సాలీ దర్శకత్వంలో నటించిన గంగూభాయి కతియావాడీ రిలీజ్ కి రావాల్సి ఉంది. అవిగాక మరో రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాటికి అగ్రిమెంట్లు కూడా పూర్తిచేసింది.