Begin typing your search above and press return to search.
అదే పనిలో ఉన్న అలియా.. RRR కు టెన్షనేనా?
By: Tupaki Desk | 31 March 2019 6:52 AM GMTఇప్పుడు బాలీవుడ్ మొత్త మీద చాలా బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే అలియా భట్. 'కళంక్'.. 'బ్రహ్మాస్త్ర'..'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'.. 'ఇన్షా అల్లా'.. 'RRR'.. ఇలా ఉంది ఆమె సినిమాల లిస్టు. అన్నీ భారీ ప్రాజెక్టులే. ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉండడం ఆమె ఫ్యాన్స్ కు సంతోషమేమో గానీ అలియాను హీరోయిన్ గా తీసుకున్న నిర్మాతలకు దర్శకులకు కాస్త టెన్షనే.
'కళంక్' పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' లో జస్ట్ క్యామియో కాబట్టి ఎక్కువ కాల్షీట్స్ అవసరం కావు. కానీ మిగతా సినిమాలనీ భారీ ప్రాజెక్టులే. ఈ సినిమాలకే డేట్స్ సర్దుబాటు చేయగలుగుతుందా లేదా అనే అనుమానాలు ఉంటే ఇవి కాకుండా రీసెంట్ గా పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మౌంటెనీర్ పాత్ర అంటే ఏదో నటించాం అన్నట్టుగా ఉండదు. దానికి ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది. ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులకు ఎలా కాల్షీట్స్ సర్దుబాటు చేస్తుందా అనే పరిస్థితిలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడంలలో మర్మమేంటో అర్థం కావడం లేదు. ఈ కొత్త సినిమాలను సైన్ చేసే హంగామా ఇంతటితో అపుతుందా లేదా తన దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాజెక్టును సైన్ చేసుకుంటూ పోతుందా అనేది కూడా అంతుచిక్కడం లేదు.
దీంతో ఇన్ని ప్రాజెక్టులను ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతుందా.. రాజమౌళి RRR కాల్షీట్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఈ అనుమానం ఎందుకంటే.. అయన సినిమాను చెక్కడంలో ఒక్కోసారి షెడ్యూల్స్ డిలే అవుతాయి. అప్పుడు అలియా డేట్స్ పరిస్థితి ఏంటనేది వారి అనుమానం. ప్రస్తుతానికికైతే ఆమె సైన్ చేసిన సినిమాలు అన్నీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. 'ఇన్షా అల్లా'.. అరుణిమ సిన్హా బయోపిక్ లు కూడా సెట్స్ మీద కెళ్తేగానీ ఆ విషయం తెలియదు.