Begin typing your search above and press return to search.

రిషీ క‌పూర్ జ్ఞాప‌కాల్లో ర‌ణ‌బీర్ -అలియా కొత్త కాపురం!

By:  Tupaki Desk   |   14 April 2022 2:30 AM GMT
రిషీ క‌పూర్ జ్ఞాప‌కాల్లో ర‌ణ‌బీర్ -అలియా కొత్త కాపురం!
X
బాలీవుడ్ ప్రేమ జంట ర‌ణ‌బీర్ క‌పూర్- అలియాభ‌ట్ మరికొన్ని గంట‌ల్లో ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం రెండు కుటుంబాలు పెళ్లి హ‌డావుడిలోనే ఉన్నాయి. ఓవైపు ఆర్కే స్టూడియోలో గ్రాండ్ గా పెళ్లి ముందొస్తు వేడుక‌లు జ‌రుగుతున్నాయి. `మెహందీ`..`సంగీత్` కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌వ్వాల‌నుకున్న‌ అతిధులంతా విచ్చేస్తున్నారు. ర‌ణ‌బీర్ ఇంట్లోనే గ్రాండ్ గా పెళ్లి జ‌రుగుతుంది. `వాస్తు` అని పిలుచుకునే ఆరు అంత‌స్తులో భ‌వంతిలో వివాహం జ‌రుగుతుంది.

వాస్త‌వానికి రిషీక‌పూర్ నివ‌సించిన `కృష్ణ‌రాజ్ బంగ్లా` లో వివాహం చేయాల‌నుకున్నారు. కానీ ఆ ఇంటిని రీమోడ‌లింగ్ చేస్తున్నారు. దీంతో వివవాహాన్ని వాస్తు భ‌వ‌నానికి మార్చారు. అయితే ఈ వివాహం కేవ‌లం కుటుంబ స‌భ్యులు..అతికొద్ది మంది సెల‌బ్రిటీల స‌మక్షంలోనే జ‌రుగుతుంది. రేపు మ‌ధ్నాహ్నం స‌రిగ్గా మూడు గంట‌ల‌కు వివాహం జ‌రుగుతుంది. ఇక ప్రియురాలుకి ర‌ణ‌బీర్ స్పెష‌ల్ గిప్ట్ గా వెడ్డింగ్ బ్యాండ్ ఇస్తున్నాడు. ఇది అత్యంత ఖ‌రీదైన‌ది.

8 వ‌జ్రాలు పొదిగిన బ్యాండ్ అది. చేతికి పెట్టుకుంటే త‌ళ‌త‌ళ మెరిసిపోతుంది. ఇక అలియా భ‌ట్ కూడా ప్రియుడికి ఖ‌రీదైన బ‌హుమ‌తులు ఇస్తుందిట‌. కానీ వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈరోజు రాత్రికి సంగీత్ ఫంక్ష‌న్ ఉంటుందిట‌. ఇరు కుటుంబ స‌భ్యులు..కీల‌క వ్యక్తులు వేదిక వ‌ద్ద‌కు చేరుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక పెళ్లి అయిన మూడు రోజుల త‌ర్వాత తాజ్ హోట‌ల్ లో భారీ ఎత్తున రిసెప్ష‌న్ ఉంటుంది. ఆ కార్య‌క్ర‌మానికి దాదాపు బాలీవుడ్ సెల‌బ్రిటీలు అంతా హాజ‌ర‌వుతారు. వివిధ దేశాల‌ వంట‌కాలు స్పెష‌ల్ అంట‌.

ఇప్ప‌టికే అంద‌రికీ వెడ్డింగ్ కార్డ్ పంపిణీ కూడా పూర్తి చేసారు. ఇక పెళ్లి త‌ర్వాత ర‌ణ‌బీర్- అలియా కాపురం ఉండే స్పాట్ కూడా ముందుగానే ఫిక్సై పోయింది. రిషీ క‌పూర్ ఎంతో ఇష్ట‌ప‌డి క‌ట్టించుకున్న కృష్ణ‌రాజ్ బంగ్లా లో కొత్త కాపురం మొద‌లు పెట్ట‌నున్నారు. కొద్దిపాటి మార్పులు అవ‌స‌రం అవ్వ‌డంతో రీమోడ‌లింగ్ చేస్తున్నారు. వాస్త‌వానికి పెళ్లి అక్క‌డ చేసి అదే రోజున పెళ్లి కూతురి కుడి కాలు గ‌డ‌ప లోప‌ల పెట్టించాల‌ని ప్లాన్ చేసారు. కానీ రీమోడ‌ల్ ప‌నులు కార‌ణంగా వేదిక మారింది.

ముందుగా ఆర్కే స్టూడియోలోనే పెళ్లి చేయాల‌నుకున్నారుట‌. కానీ అలా చేస్తే సెక్యురిటీ స‌మ‌స్య‌లు స‌హా..రిషీ క‌పూర్ కొరిక ప్ర‌కారం కూడా పెళ్లి జ‌రిగిన‌ట్లు ఉండ‌ద‌ని భావించి ఆరు అంత‌స్తుల భ‌వంతిని వేదిక చేసిన‌ట్లు తెలుస్తోంది.