Begin typing your search above and press return to search.
ఫ్రెగ్నెన్సీ ప్రచార స్టంట్ అన్నవారికి రణబీర్ జవాబు
By: Tupaki Desk | 10 July 2022 11:07 AM GMTబాలీవుడ్ యువహీరో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర- శంషేరా చిత్రాలతో ఇటు తెలుగు ఆడియెన్ కి కనెక్టయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళం సహా దక్షిణాది భాషలకు పరిచయమవ్వాలని ఇక్కడ లోకల్ స్టార్ అవ్వాలని కలలుగంటున్నాడు. ఇంతలోనే అలియా భట్ ని పెళ్లాడిన అతడు తండ్రి అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కొత్త జంట తమ మొదటి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
అలియా తన ఇన్ స్టాగ్రామ్ లో ``మా బేబీ త్వరలో వస్తుంది`` అంటూ ఎగ్జయిటింగ్ గా ప్రకటించింది. ఇక కపూర్ ఆనందానికి అవధుల్లేవ్. కానీ ఈ ప్రచారాన్ని కొందరు సహించడం లేదు. ట్రోలర్లు ఆలియా గర్భధారణ వార్తలను `బ్రహ్మాస్త్ర`కు ప్రచార స్టంట్ అని విమర్శిస్తూ సదరు జంటపై ఎదురుదాడికి దిగారు. అయితే ఈ ఆరోపణలపై తండ్రి కాబోతున్న రణబీర్ తనదైన శైలిలో స్పందించాడు.
రణబీర్ మోస్ట్ అవైటెడ్ `షంషేరా`ను ఫుల్ స్వింగ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. మూవీ ప్రచారంలో పూర్తి బిజీగా ఉన్నాడు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా రణవీర్ ని అలియా గర్భానికి సంబంధించిన ట్రోలింగ్ పై స్పందించమని కోరగా.. రణబీర్ తాను అలియా కేవలం అభిమాన ప్రపంచంతో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇందులో మరో ఆలోచన లేదని కూడా అన్నాడు.
ఇంకా రణబీర్ కపూర్ కూడా అలియాతో పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందనే విషయంపైనా తన మనసు విప్పాడు. ``తను నాకు చాలా ప్రేమను ఆనందాన్ని ఇచ్చింది. నేను కొన్నిసార్లు చాలా తప్పులు చేశాననే భావనను కలిగి ఉన్నాను. ఆనందం నానుంచి పోతుందని నేను భావించాను. అందుకే నేను దానిని రక్షించుకోవాలి. మా బంధంలో ఇది చాలా సంతోషకరమైన సమయం. గత కొన్నేళ్లుగా మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాం. కానీ మా జీవితంలో ఈ కాలాన్ని నిజంగా ఆస్వాధించాలనుకుంటున్నాం``అని రణబీర్ తన మనసులో మాటను తెలిపాడు.
ప్రస్తుతం సంజయ్ దత్ - వాణి కపూర్‌లతో తన తదుపరి `శంషేరా` విడుదల కోసం రణబీర్ ఎదురుచూస్తున్నాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 22 జూలై 2022న విడుదల కానుంది. రణబీర్ - అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది. ఈ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎఇగేందుకు రణబీర్ ప్రయత్నిస్తున్నాడు. తనకు ఆలియా బోలెడంత ప్రచారం చేస్తోంది.