Begin typing your search above and press return to search.

వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. వెన్యూ వెతుకుతున్న జంట‌?

By:  Tupaki Desk   |   29 Sep 2021 10:30 AM GMT
వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. వెన్యూ వెతుకుతున్న జంట‌?
X
బాలీవుడ్ లో మ‌రో జంట ఒక్క‌టి కాబోతోంది. అదే ర‌ణ్‌బీర్ క‌పూర్‌.. ఆలియాభ‌ట్‌. గ‌త కొంత కాలంగా ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు శికారు చేస్తున్నాయి. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ అలియాభ‌ట్‌.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ఏదో ఒక సంద‌ర్భంలో జంట‌గా క‌నిపించి సంద‌డి చేస్తూనే వున్నారు. తాజాగా అలియాభ‌ట్ ప్రియుడు.. హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో క‌లిసి బీచ్ ఒడ్డున కూర్చుని స‌న్ లైట్‌ని ఎంజాయ్ చేస్తున్న ఓ ఫొటోని షేర్ చేసింది. దీనికి `హ్యాపీ బ‌ర్త్‌డే మై లైఫ్‌` అంటూ క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది.

సెప్టెంబ‌ర్ 28న ర‌ణ్ బీర్ క‌పూర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా అత‌నికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తూ అలియాభ‌ట్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన తాజా ఫొటో త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌నే సంకేతాల్ని అందిస్తోంది. గ‌త ఏడాది కాలంగా వీరిద్ద‌రిపై బాలీవుడ్ లో రూమ‌ర్‌లు వినిపిస్తూనే వున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ రూమ‌ర్‌ల‌కి త‌గ్గ‌ట్టుగా అలియా .. ర‌ణ్‌బీర్ క్లోజ్‌గా వున్న త‌మ‌ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకుంటూ వాటికి మ‌రింత ఆజ్యం పోస్తున్నారు.

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ పెళ్లి గురించి వివ‌రించి షాకిచ్చాడు ర‌ణ్ బీర్‌. పాండ‌మిక్ కి ముందే త‌మ పెళ్లి సెట్ట‌యింద‌ని.. అయితే కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంద‌ని వివ‌రించాడు. అయితే తాజాగా వీరి వెడ్డింగ్ కి డేట్ ఫిక్స్ అయింద‌ని.. వెడ్డింగ్ వెన్యూ కోసం ఇటీవ‌లే జోధ్ పూర్ లోని అత్యంత సుంద‌ర‌మైన ప్రదేశాల‌ని ర‌ణ్‌బీర్‌.. అలియా ఇద్ద‌రూ క‌లిసి వెళ్లార‌ని.. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. అన్నీ స‌వ్యంగా కుదిరితే ఈ ఏడాది ఎండింగ్‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తాజా న్యూస్‌.

ప్ర‌స్తుతం అలియా .. సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందిస్తున్న `గంగూబాయి క‌తియావాడీ`తో పాటు ర‌ణ్ బీర్ క‌పూర్ తో క‌లిసి అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న `బ్ర‌హ్మాస్త్ర‌`లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు

ప్రేమ గువ్వ‌లు ఏంటా కువ‌కువ‌లు!

తన 39వ పుట్టినరోజు వేడుక‌ల్లో భాగంగా రణబీర్ కపూర్ త‌న ప్రియురాలు అలియా భట్ తో క‌లిసి జోధ్ పూర్ అడ‌వుల్లో షికార్ చేయ‌డం కంట ప‌డింది. నగరానికి చెందిన కెమెరా మెన్ లు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోల్లో ఆలియా క్రాప్ టాప్ తో ఒక జత జీన్స్ ధరించి క‌నిపించింది. ఆమె ఆకుపచ్చ - తెలుపు జాకెట్ ధ‌రించి సన్ గ్లాసెస్ తో అద్భుతంగా క‌నిపిస్తోంది. రణబీర్ మాత్రం మొత్తం బుర్గుండి దుస్తులను ఎంచుకున్నాడు.

సెప్టెంబర్ 28 మంగళవారం నాటికి రణబీర్ ఒక సంవత్సరం పెద్దవాడవుతాడు. గత సంవత్సర, అతను తన పుట్టినరోజును తన తల్లి నీతూ కపూర్- సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని - ఆలియాతో గడిపాడు. అతను నీతూ .. రిద్ధిమాతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోని ఆలియా పోస్ట్ చేసింది. రెండు పుట్టినరోజు కేక్ లతో పోజులిచ్చారు ర‌ణ‌బీర్.

గత సంవత్సరం మహమ్మారి లేకపోతే తాను ఆలియా వివాహం చేసుకునేవాళ్ల‌మ‌ని రణబీర్ వెల్లడించాడు. మాజీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ తో రణ్‌బీర్ మాట్లాడుతూ.. “మహమ్మారి మన జీవితాలను తాకకపోతే ఈపాటికే పెళ్లి అయ్యేది. కానీ నేను ఏదో ఒక‌టి చెప్పడం ద్వారా హ‌డావుడి చేయ‌ను. నా జీవితంలో త్వరలో ఆ లక్ష్యాన్ని గుర్తించాలనుకుంటున్నాను`` అని అన్నారు.

అలియా - రణబీర్ గత మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించనున్న వీరిద్దరూ తరచూ ఒకరి కుటుంబాలతో ఒక‌రు గడపడం కనిపిస్తుంది. ఇటీవల రణబీర్ తన తండ్రి.. చిత్రనిర్మాత మహేష్ భట్ పుట్టినరోజును జరుపుకోవడానికి అలియాతో కలిశాడు. ఇప్పుడు జోధ్ పూర్ లో ప‌ర్యటిస్తూ ఈ జంట పెళ్లి వెన్యూని వెతుకుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.