Begin typing your search above and press return to search.
RRRలో 15 నిమిషాలే కానీ చుక్కల్లో పారితోషికం?
By: Tupaki Desk | 27 Nov 2021 8:30 AM GMTరామ్ చరణ్-ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం RRR సంక్రాతి కానుకగా జనవరి 7న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. యూనిట్ ప్రచారం పనుల్లో బిజీ కానుంది. డిసెంబర్ మొత్తం ప్రమోషన్ కే సమయం కేటాయించనున్నారు. రిలీజ్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం అలియా భారీగానే డిమాండ్ చేసిందని తెలిసింది.
10 రోజుల షూటింగ్ కి గాను ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు ఛార్జ్ చేసిందట. అంటే రోజుకి 50 లక్షలు చొప్పున అలియాకి `ఆర్.ఆర్.ఆర్` నిర్మాతలు చెల్లించారు. పది రోజులకి 5 కోట్లు అంటే చాలా ఎక్కువ. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్లు అందుకుంటుంది. రెండు నెలలు కాల్షీట్లు కేటాయిస్తుంది. కానీ `ఆర్.ఆర్.ఆర్` విషయంలో అలియా ఎంతమాత్రం మెట్టు దిగలేదు. 15 నిమిషాల స్క్రీన్ టైమ్ తో ఆలియా పాత్ర ఉంటుంది. దానికి 10 రోజుల షూటింగ్ కే 5 కోట్లు అంటే చాలా టూమచ్ అనేస్తున్నారు. పారితోషికం కారణంగానే అప్పట్లో ఒకానొకదశలో ప్రాజెక్ట్ నుంచి అలియా భట్ తప్పుకుంటుందని ప్రచారం సాగింది. అయితే ఆ పాత్రకు కేవలం అలియా మాత్రమే కావాలని రాజమౌళి పట్టుడట్టడంతో నిర్మాత దానయ్య చేసేది లేక 5 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక బిజీ స్టార్ అయిన ఆలియాను అదనంగా కాల్షీట్లు కేటాయించమన్నా ఎలాంటి మినహాయింపులు ఉండవని తాను డేట్లు ఇచ్చిన సమయంలోనే షూటింగ్ చేసుకోవాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఆ రకంగానే రాజమౌళి కూడా షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అలియాభట్ చాలా బిజీ నటిగా కొనసాగుతోంది. మహేష్ భట్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్ నంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోతోంది. ఆలియాకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. హిందీ ఆడియెన్ లో తనకు ఉన్న పాపులారిటీ ఆర్.ఆర్.ఆర్ కి ప్లస్ కానుందని రాజమౌళి భావిస్తున్నారు. ఇక ఆలియా తండ్రికి తగ్గ వారసురాలిగా బిజినెస్ ఐడియాలజీతో ఏల్తోంది. త్వరలోనే రాక్ స్టార్ రణబీర్ ని భట్స్ వారసురాలు పెళ్లి చేసుకుని కపూర్ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతుంది.