Begin typing your search above and press return to search.
హాలీవుడ్ లో అయినా ఇంత తీసుకుంటారా?
By: Tupaki Desk | 12 Jan 2022 2:30 AM GMTఒకప్పుడు హీరోల పారితోషికాలతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం చాలా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు సౌత్ లో కూడా హీరోలు మరియు హీరోయిన్స్ పారితోషికాల మద్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అయితే స్టార్ హీరోయిన్స్ మునుపటితో పోల్చితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సౌత్ హీరోయిన్స్ రెండు కోట్ల పారితోషికం తీసుకుంటే రెండు మూడు ఏళ్ల వరకు చాలా పెద్ద విషయం. కాని ఇప్పుడు నాలుగు అయిదు కోట్ల పారితోషికాలను కూడా తీసుకుంటున్న సౌత్ హీరోయిన్స్ ఉన్నారు. ఇక బాలీవుడ్ లో హీరోయిన్స్ పారితోషికం హీరోల పారితోషికాలకు ఏమాత్రం తగ్గట్లేదు అంటున్నారు. ఇటీవల ఆలియా భట్ తీసుకున్న 20 కోట్ల రూపాయల పారితోషికం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన గంగూభాయ్ కథియావాడి సినిమాలో ఆలియా భట్ నటించిన విషయం తెల్సిందే. ఆలియా ఆ ఛాలెంజింగ్ రోల్ ను చేసినందుకు గాను ఏకంగా రూ.20 కోట్ల పారితోషికంను అందుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆలియా మాత్రమే కాకుండా కంగనా రనౌత్.. ఇతర పెద్ద హీరోయిన్స్ కూడా పది నుండి పదిహేను ఆపై పారితోషికాలు అందుకుంటున్న సందర్బాలు ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు 20 కోట్ల రూపాయల పారితోషికం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇచ్చేందుకు సిద్దం అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. హీరోల సినిమాలకు భారీ పారితోషికాలు ఇచ్చి హీరోయిన్స్ సినిమాలకు కూడా ఇలా భారీ పారితోషికాలు ఇస్తే ముందు ముందు ఫిల్మ్ మేకింగ్ మరింత భారం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హాలీవుడ్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా.. కొందరు హీరోయిన్స్ అయితే హాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా దాటి మరీ పారితోషికాలు దక్కించుకోవడం చర్చనీయాంశంగా ఉంది. హీరోయిన్స్ ఏడాదిలో నాలుగు అయిదు సినిమాలు చేస్తారు. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ శారీరక హింస తక్కువగా ఉంటుంది. దానికి తోడు స్టార్ హీరోల రేంజ్ లో హీరోయిన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండరు. కనుక వారికి పారితోషికం తక్కువ అంటూ ఇన్నాళ్లు ఫిల్మ్ మేకర్స్ వారి పారితోషికాల విషయంలో వాదిస్తూ వచ్చారు. కాని ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ పారితోషికం విషయంలో తగ్గేది లే అన్నట్లుగా వసూళ్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆ రేంజ్ లో పారితోషికాలు హీరోయిన్స్ పెంచేస్తే వెంటనే కాకున్నా కొన్ని ఏళ్ల తర్వాత అయినా సౌత్ హీరోయిన్స్ కూడా ఆ రేంజ్ పారితోషికం డిమాండ్ చేస్తారు అనడంలో సందేహం లేదు.