Begin typing your search above and press return to search.
జక్కన్న హీరోయిన్ కు అక్కడ పెద్ద షాక్
By: Tupaki Desk | 24 April 2019 1:30 AM GMTవరుణ్ ధావన్ - ఆలియా భట్ - సంజయ్ దత్ - మాధురి దీక్షిత్ - సోనాక్షి సిన్హా - ఆధిత్య రామ్ కపూర్ వంటి స్టార్ట్ నటించిన 'కళంక్' చిత్రం ఏప్రిల్ 17వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. ఆలియా భట్ గత చిత్రాలు అయిన 'రాజి' - 'గల్లీ బాయ్' సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తప్పకుండా ఈ చిత్రం కూడా ఆమెకు మరో బ్లాక్ బస్టర్ ను ఇస్తుందని ఆమె అభిమానులు భావించారు. కాని అనూహ్యంగా 'కళంక్' చిత్రం ఆమెకు నిరాశ మిగిల్చింది.
ఈ చిత్రంను అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. ఈ కథతో కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ సినిమా చేయాలని ఆశించాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ను కరణ్ జోహార్ తెరకెక్కించాడు. తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వడంతో ఎక్కడ రాజీ పడకుండా దాదాపుగా 135 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రంను రూపొందించినట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల ముందు వరకు ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తర్వాత బ్యాడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ రెండవ ఆట నుండే డ్రాప్ అయ్యాయి.
మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లను రాబడుతుందని భావిస్తే కనీసం 75 కోట్ల వరకు కూడా రాలేక పోయిందని - లాంగ్ రన్ లో కూడా 100 కోట్లను రాబట్టడం కష్టమే అంటున్నారు. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నా కూడా సినిమాలో దమ్ము లేకపోవడం వల్ల ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
వరుస హిట్స్ తో దూకుడు మీద ఉందనే ఉద్దేశ్యంతో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో చరణ్ కు జోడీగా ఆలియా భట్ ను జక్కన్న ఎంపిక చేశాడు. అయితే తాజాగా కళంక్ చిత్ర ఫలితం ఆమెకు చేదు అనుభవంను మిగిల్చింది. ఈ ప్రభావం బాలీవుడ్ లో 'ఆర్ ఆర్ ఆర్' మార్కెట్ విషయంలో ఏమైనా ప్రభావం పడుతుందా అనే చర్చ మొదలైంది. జక్కన్న బ్రాండ్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈజీగా బిజినెస్ అవుతుంది. ఆలియా సక్సెస్ - ఫ్లాప్ లపై జక్కన్న ఆధారపడాల్సిన పని లేదు. బాలీవుడ్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ సంచలనంగా నిలవడం ఖాయం.