Begin typing your search above and press return to search.

17 ఏళ్ల తర్వాత హాలీడే.. ఫలక్‌నుమాలో

By:  Tupaki Desk   |   9 July 2015 5:47 AM GMT
17 ఏళ్ల తర్వాత హాలీడే.. ఫలక్‌నుమాలో
X
చిక్లెట్‌ కళ్లు.. చాక్లెట్‌ పెదవులు.. సిల్లీ స్మయిల్‌తో సంపేసే పిల్ల ఆలియాభట్‌. బాలీవుడ్‌లో 100మంది కథానాయికలు ఉన్నా.. అందరిలోనూ ఈ అమ్మడు వెరీ స్పెషల్‌. ఆలియానా మజాకానా? డ్రెస్సింగ్‌ స్టయిల్‌, వాకింగ్‌ స్టయిల్‌, లుకింగ్‌ స్టయిల్‌.. అదిరెను ఇస్టయిల్‌ అన్నట్టు ఉంటుంది యవ్వారం. మహేష్‌భట్‌ అంతటి గొప్ప ఫిలింమేకర్‌కి కూతురిగా ఆ రేంజు ఉన్నా.. తనకంటూ ఓ సపరేటు రూటుందని ఇప్పటికే నిరూపించింది ఈ పాలబుగ్గల పోరి.

ఈ అమ్మడికి హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టమట. అంతేనా ఈవిడగారి ఫాదర్‌ ఎక్కడికీ ప్రయాణాలు అనేవే పెట్టుకోడట. అతడు ఎప్పుడు చూసినా ఇంటిపట్టునే ఉంటాడు. ఈవిడ మాత్రం శికార్లు చేసి వస్తుంటుంది. అలా ఈ ఏడాది హైదరాబాద్‌ వచ్చింది. రావడమే కాదు.. పాత బస్తీలోని పురాతన కిల్లా ఫలక్‌నుమాలో బస చేసింది. ఫలక్‌నుమా ఫ్యాలెస్‌ అంటే బస్తీలో చాలా ఫేమస్‌. పురాతన కాలం నాటి వస్తువలతో, గొప్ప ఆర్కిటెక్చర్‌తో కళానైపుణ్యంతో గొప్పగా ఉంటుంది. అప్పట్లో సల్మాన్‌ఖాన్‌ సోదరి పెళ్లి కూడా ఇందులోనే జరిగింది. ప్లేటు భోజనం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశారిక్కడ. అందుకే ఆలియా ఇక్కడ బస చేసింది అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

ఇక.. నాన్న మహేష్‌ భట్‌ దాదాపు 17ఏళ్ల తర్వాత ప్రయాణం పెట్టుకుని హైదరాబాద్‌ వచ్చాడు. అదీ ఫలక్‌నుమాలో బస వేయడానికి. ఫైనల్‌గా ఆలియా మరికొన్ని సంగతులు చెప్పింది. నేను ఫెమినిస్టుని.. అంటూనే షాహిద్‌ని ఏడిపించే ప్లాన్‌ వేశానని చెప్పింది. అతగాడు ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. కంగ్రాట్స్‌... కానీ .. అంటూ చిలిపిగా నవ్వేసింది. దటీజ్‌ ఆలియా అన్నమాట!