Begin typing your search above and press return to search.

ఆలియా జీవితంలో ఎప్పుడూ ఇన్ని పాట్లు ప‌డ‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   5 April 2022 3:30 AM GMT
ఆలియా జీవితంలో ఎప్పుడూ ఇన్ని పాట్లు ప‌డ‌లేద‌ట‌!
X
ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో తొలి అనుభ‌వం అనేది కొత్త‌గా వింత‌గా గ‌మ్మ‌త్తుగా అనిపిస్తుంది. ఆలియాకు కూడా అలాంటి అనుభ‌వ‌మే అయ్యింది. అయితే దానికి కార‌కుడు ఎవ‌రు? అంటే జ‌క్క‌న్న‌. తాజాగా ఆలియా భట్ RRR సెట్స్ నుండి తన అనేక మొదటి విషయాలను పంచుకుంది. ఆమె ఒకటిన్నర సంవత్సరం పాటు ఒక ప్ర‌త్యేక‌ సన్నివేశాన్ని అభ్యసించాన‌ని వెల్లడించింది.

అలియా భట్ భారీ పాన్ ఇండియా మూవీ RRR తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్-ఇండియా చిత్రంలో ఆలియా చేసిన‌ది చిన్న పాత్రే అయినప్పటికీ కీలకమైన పాత్రను పోషించింది. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించ‌గా.. ఈ సినిమాలో సీత పాత్రలో అలియా నటించింది.

చిన్న పాత్రలో చేసినా ఆలియా ఎలాంటి భేష‌జానికి పోకుండా చిత్ర‌ బృందంతో కలిసి సినిమాను చురుకుగా ప్రమోట్ చేసింది. ఇప్పుడు చిత్రం విడుదలైన ఒక వారం తర్వాత అలియా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అరంగేట్రం ను మ‌న‌నం చేసుకుంటూ... తన అనేక మొదటి విషయాల (ఫ‌స్ట్ టైమ్ మ్యాట‌ర్స్) గురించి మాట్లాడుతూ ఉన్న‌ వీడియోను షేర్ చేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఒక సన్నివేశాన్ని ఏడాదిన్నర పాటు ప్రాక్టీస్ చేశానని అలియా భట్ వెల్లడించింది. ఆలియా ఆర్‌.ఆర్‌.ఆర్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియోలో చాలా సంగ‌తుల‌ను చెప్పింది. మొట్టమొదట తెలుగు నేర్చుకున్నాన‌ని చెప్పింది.

తాను తొలిసారిగా ఏడాదిన్నర పాటు ఓ సీన్ ని ప్రాక్టీస్ చేశానని కూడా ఆలియా వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా నేను మొదటిసారిగా ఒకటిన్నర సంవత్సరాలు ఒక సన్నివేశాన్ని నేర్చుకున్నాను. కాబట్టి నేను దానిని నేర్చుకోవడం ప్రారంభించాను.. ఎందుకంటే నేను ఒక నెలలో షూట్ చేయాలనుకోగా.. ఆపై లాక్ డౌన్ లోకి వెళ్లాము. ఆపై నేను దానిని ఒకటిన్నర సంవత్సరాలు నేర్చుకుంటూనే ఉన్నాను" అని ఆమె తెలిపింది. క‌రోనా వ‌ల్ల ప‌దే ప‌దే వాయిదా ప‌డుతుంటే ఇలా చేయాల్సొచ్చింద‌ని అర్థం చేసుకోవాలి.

తన పాత్ర కోసం తన జుట్టుకు చాలాసార్లు రంగులు వేయవలసి వచ్చిందని కూడా ఆలియా చెప్పింది. మొదటిసారి నా జుట్టు రంగు ఆర్.ఆర్.ఆర్ తో పాటు మ‌రో మూవీ కోసం కొనసాగింపులో ఉంది. RRRలో నేను ముదురు జుట్టు కలిగి ఉండవలసి వచ్చింది. నేను జుట్టుకు రంగు వేసుకున్నాను కానీ లైట్ కారణంగా సెట్ కి వెళ్లినప్పుడు హైలైట్స్ ఇప్పటికీ కనిపించాయి " అని ఆమె చెప్పింది.

త‌న‌ బృంద సభ్యులలో ఒకరు ``మేము హోటల్ కి వెళ్లి జుట్టుకు నాలుగు సార్లు రంగులు వేసుకున్నాము`` అని కూడా తెలిపారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ షూటింగ్ లో ఉండగానే ఓ సినిమా సెట్స్ లో తొలిసారి బిర్యానీ తిన్నానని అలియా తెలిపింది. అలాగే ఆర్.ఆర్.ఆర్ ప్ర‌చారం కోసం చాలా ఎక్కువ స‌మ‌యం కేటాయించాన‌ని ఇన్ని పాట్లు ఇంత‌కుముందు ఎప్పుడూ ప‌డ‌లేద‌నే అర్థంలోనూ ఆలియా మాట్లాడింది.

ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం జ‌క్క‌న్న చాలా ప్రిప‌రేష‌న్ సాగించేవాడ‌ని త‌న‌కు ఇలాంటి భారీ ప్ర‌చారం అనేది ఇదే తొలిసారి అని కూడా వెల్ల‌డించింది. మామూలుగానే హిందీ చిత్రాల‌కు ఇంత భారీ ప్ర‌మోష‌న్ ఈవెంట్లు ఉండ‌వు గనుక ఆలియాకు సౌత్ లో అస‌లు విష‌యం అర్థ‌మైంద‌న్న‌మాట‌.