Begin typing your search above and press return to search.

డిప్రెష‌న్ లో సూసైడ్ ట్రై చేసిన సిస్ట‌ర్ ఈవిడేనా?

By:  Tupaki Desk   |   16 March 2020 4:30 PM GMT
డిప్రెష‌న్ లో సూసైడ్  ట్రై చేసిన సిస్ట‌ర్ ఈవిడేనా?
X
బాలీవుడ్ యువ క‌థానాయిక అలియా భ‌ట్ కి అచ్చం త‌న షాడో లాంటి సిస్ట‌ర్ ఒక‌రు ఉన్న సంగ‌తి తెలిసిందే. సేమ్ ఏజ్.. సేమ్ లుక్.. సేమ్ టు సేమ్ గానే క‌నిపిస్తుంటుంది. త‌న అక్క‌ షాహీన్ భ‌ట్ అంటే త‌న‌కు విప‌రీత‌మైన ఇష్టం.. ప్రేమ‌.. అభిమానం. అక్క‌ ఏడిస్తే త‌న కంట నీరు వ‌స్తుంది! అంత‌టి అనుబంధం ఉంది. అయితే ఒకానొక స‌మ‌యంలో త‌న సోద‌రి ఏకంగా సూసైడ్ ఎటెంప్ట్ చేసింద‌ట‌. ఆ సంగ‌తిని తాను గ్ర‌హించ‌లేక‌పోయాన‌ని ఆలియా తెగ బాధ‌ప‌డిపోయింది.

ఇక ఆలియా ప్రోఫెష‌న‌ల్ కెరీర్ ధేధీప్య‌మానంగా వెలిగిపోతున్న టైమ్ లో ఓ వేదిక‌ పై ఆలియానే ఈ సంగ‌తిని చెప్పింది. ప్ర‌స్తుతం ఈ కుర్ర‌బ్యూటీ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఓవైపు కెరీర్ బిజీ.. మ‌రోవైపు అటు ర‌ణ‌బీర్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం స‌జావుగా సాగిపోతున్నాయ్‌. ప్రోఫెష‌న‌ల్ కెరీర్.. ప‌ర్స‌న‌ల్ కెరీర్ రెండూ హ్యాపీగానే ఉన్నాయి. అయితే సిస్ట‌ర్ షాహీన్ భ‌ట్ కార‌ణంగా అలియా బాగా డిస్ట్ర‌బ్ అయిందిట‌.

నా జీవితంలో సంతోషంగా సాగిపోతుంటే? సోద‌రి జీవితం అలా అయిందేమిటో అంటూ ఎంతో ఎమోష‌న్ అయిపోయింది. ఓ వేదిక‌పై ఆలియా ఏకంగా క‌న్నీరు పెట్టుకుంది. అక్క షాహీనా భ‌ట్ వ్య‌క్తిగ‌త కార‌ణాలతో తీవ్ర ఒత్తిడికి గురైంది. దాంతో ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించింది. అంత‌కు ముందే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మందు బిళ్ల‌లు మింగి ఏదోలా ఉప‌శ‌మ‌నం పొందింది షాహిన్.

కానీ రోజు రోజుకి మాన‌సికంగా మ‌రింత కృంగి పోవ‌డంతో ఏకంగా సూసైడ్ కే విఫ‌ల‌య్న‌తం చేసింది. ఇదే విష‌యాన్ని అలియా ఇటీవ‌ల‌ గుర్తు చేసుకుని వాపోయింది. సూసైడ్ చేసుకుంటోన్న స‌మ‌యంలో త‌న‌కు విష‌యం తెలియ‌లేద‌ని.. ఆ స‌మ‌యంలో తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని...ఎంత‌గా బాధ‌ప‌డి ఉంటుందో అంటూ క‌న్నీరు పెట్టుకుంది. అయితే ఇప్పుడా విష‌యాల‌న్ని మ‌ర్చి పోయి గ‌తం గ‌త‌హా అన్న‌ట్లు సంతోషంగా ఉన్నామ‌ని తెలిపింది. అలాగే తాజాగా అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇద్ద‌రు చూడ‌టానికి ఒకేలా ఉన్నారు. ట్విన్స్ లా క‌నిపిస్తున్నారు. ఇందులో అక్క ఎవ‌రు? చెల్లి ఎవ‌రు? అంటూ నేటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు చిలిపి పిల్లో ఆమె ఆలియా అన్న సంగ‌తిని ఫ్యాన్స్ ఇట్టే క‌నిపెట్టేస్తున్నారంతే!