Begin typing your search above and press return to search.

గ్రేజియా మే ఆలియా క్యా కియా?

By:  Tupaki Desk   |   2 Feb 2016 1:30 PM GMT
గ్రేజియా మే ఆలియా క్యా కియా?
X
బాలీవుడ్ బ్యూటీలు అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. వంపులు, వయ్యారాలు ప్రదర్శించడంలో ఎవరి స్టైల్ వారిదే. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రదర్శించినా, ప్రయత్నించినా.. అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ స్టైలే వేరు. ఈ విషయాన్ని చాలా సార్లే ప్రూవ్ చేసుకున్నా.. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ తో తన స్టైల్ ఏంటో మళ్లీ చూపించింది ఆలియా.

గ్రేజీయా మేగజైన్ పై తళుక్కుమన్న ఆలియా భట్.. ఔట్ ఫిట్స్ విషయంలో కొత్త ట్రెండ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది. న్యూ ట్రెండ్ ని కేవలం డ్రసింగ్ కే పరిమితం చేయకుండా.. క్లీవేజ్ కి కూడా అప్లై చేసింది. ఆకట్టుకునే రంగుల్లో ఉన్న డ్రసింగ్ తోనే.. తన వంపులను వయ్యారంగా ప్రదర్శించేసింది ఆలియా. మేగజైన్ కవర్ పేజ్ లపై చాలానే ఫోటోస్ కనిపిస్తూ ఉంటాయి కానీ.. ఆలియా మాత్రం ఇందులో ఆరితేరిపోయింది. ప్రతీ లుక్ ని మెస్మరైజింగ్ గా తీర్చిదిద్దడంలో ఈమె తర్వాతే ఎవరైనా. ఎక్కువగా రెచ్చిపోకుండానే.. ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేంలా ఉన్న ఎక్స్ పోజింగ్.. ఆలియాకి మాత్రమే సొంతం.

ప్రస్తుతం కపూర్ అండ్ సన్స్ మూవీని రిలీజ్ కి రెడీ చేసింది ఆలియా భట్. మార్చ్ 18న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటివరకూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించేసింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తో, గౌరి షిండే డైరెక్షన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ ప్రారంభమైపోయింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత.. ఆలియా భట్ స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవుతుందనే అంచనాలున్నాయి.