Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇలా తట్టుకోవడం ఎలా?

By:  Tupaki Desk   |   7 Feb 2017 9:55 AM GMT
ఫోటో స్టోరి: ఇలా తట్టుకోవడం ఎలా?
X
బాలీవుడ్ కుర్ర బ్యూటీ ఆలియా భట్ రోజుకో రకంగా రెచ్చిపోతోంది. సినిమాలు ఇస్తున్న జోష్ అమ్మడి కళ్లలోనే కాదు.. మేనిలో కూడా మెరుపులను పెంచేస్తోంది. మరోవైపు స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కానీ ఆలియా భట్ మనస్తత్వం.. అభిమానులను ఉర్రూతలు ఊగించేస్తోంది.

తాజాగా ఆలియా భట్ ఓ బీచ్ ఒడ్డున కూర్చున్న ఫోటో ఒకటి ఆన్ లైన్ లో ట్రెండింగ్ అయిపోతోంది. అందాల భామల బీచ్ ఫోటోలు చాలానే ఉంటాయ్ కానీ.. ఆలియా మాత్రం మరో యాంగిల్ లో రెచ్చిపోయింది. స్కూబా డైవింగ్ ఆడుకుని.. నీటి అడుగున బాగా అలిసిపోయి పైకి వచ్చి.. ఒడ్డున సేద తీరుతున్న ఆలియా భట్ ఈ పోటోలో మనకు దర్శనం ఇస్తుంది. పింక్ కలర్‌ లో ఇన్నర్ వేర్.. బ్లాక్ కలర్ జాకెట్.. వెనకాల భారం మోస్తున్న ఆక్సిజన్ సిలిండర్.. ఇవన్నీ అమ్మడి అందాలను కష్టాన్ని చూపిస్తుంటే.. వీటన్నిటితో పాటు కాళ్లకు అతుక్కుపోయిన ఇసక రేణువులు.. ఆలియా ఎంతగా మత్తెక్కించిందో చెబుతున్నాయి.

గతేడాది వరుస హిట్స్ సాధించిన ఈ భామ.. ఇప్పుడు బద్రీనాథ్ కి దుల్హనియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. బద్రీ కి దుల్హనియా టైటిల్ ట్రాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/