Begin typing your search above and press return to search.

అలియా భట్ బ్యాగు.. కామెడీ అయిందే

By:  Tupaki Desk   |   7 May 2019 10:44 AM GMT
అలియా భట్ బ్యాగు.. కామెడీ అయిందే
X
కాదేదీ ట్రోలింగుకు అనర్హం అనేది ఈ సోషల్ మీడియా జనరేషన్ లో నెటిజనుల మాట. దేన్నైనా విమర్శిస్తూ కామెడీ చేసే నెటిజనులకు కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికిందంటే చాలు చెలరేగిపోతారు. వారిని ఆపడం ఎవరితరమూ కాదు. రీసెంట్ గా RRR హీరోయిన్ అలియా భట్ వారి బారిన పడింది. ఇంతకీ అలియా చేసిన నేరం ఏంటంటే ఒక లేటెస్ట్ మోడల్ బ్యాగ్ ను మెడకు తగిలించుకుంది.

అలియా ఏదో పని మీద ముంబై నుంచి లండన్ కు వెళ్తూ ఉండగా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అక్కడ ఫోటోగ్రాఫర్లు అలియాను తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో కి వచ్చాయి. ఈ ఫోటోలలో అలియా చాలా సింపుల్ గా వైట్ టీ షర్ట్ .. బ్లాక్ ప్యాంట్ లో కనిపించింది. కార్ల్ లేగర్ ఫెల్డ్ 2019 కలెక్షన్ యాక్ట్ 2 బ్యాగ్ తో ఆమె స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళింది. ఈ రెడ్ కలర్ బ్యాగ్ ధర ఆరు లక్షలు. నిజానికి ఆ బ్యాగ్ మోడల్ లో రెండు బ్యాగులు ఉంటాయి. ఇక చూడండి ఇంటర్నెట్ లో జోకులే జోకులు.

ఒకరు "కార్టూన్ లాగా ఉన్నావు" అన్నారు. మరొకరు "నువ్వు స్టైల్ గా బ్యాగ్ ను తగిలించుకున్నట్టు లేదు. లండన్ కు బ్యాగులు అమ్మేందుకు వెళ్తున్నట్టు ఉంది" అన్నారు. ఇంకో నెటిజనుడు "ఈ బ్యాగ్ సెలెక్షన్ రణబీర్ దే అయిఉంటుంది" అని మధ్యలో బాయ్ ఫ్రెండ్ ను లాగాడు. మరో నెటిజనుడు "నవ్వలేక చచ్చిపోతున్నా.. ఏంటది?" అన్నాడు. ఇంకో నెటిజనుడు "1+1 ఆఫర్లో కొన్నావా?" అని అనుమానం వ్యక్తం చేశాడు. మరొకరు "రణబీర్ ఐటమ్స్ ఒక బ్యాగ్ లో.. నీ ఐటమ్స్ ఇంకో బ్యాగులో" అన్నాడు. ఇలాంటి బ్యాగులను బస్ కండక్టర్లకు ఇస్తే బాగుంటుందని మరో నెటిజనుడు అభిప్రాయపడ్డాడు.