Begin typing your search above and press return to search.
ఆలియాకు సంస్కారం తెలీదా.. ఎందుకీ చీవాట్లు?
By: Tupaki Desk | 20 Sep 2019 3:42 PM GMTసెలబ్రిటీలు సభ్యత-సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే అది కాస్తా మీడియాలో హైలైట్ అయిపోతుంటుంది. ఒక్కోసారి కంగారులోనో లేక హడావుడిలోనో మీడియాని పట్టించుకోవడం కుదరదు. ఓవైపు మీడియా వెంటపడుతుంటే చకచకా వచ్చిన పని కానిచ్చి వెళ్లిపోవాలనే కంగారులో సెలబ్రిటీలు ఉంటారు. అయితే అలాంటి సందర్భంలో బాడీ గార్డ్స్ వెంటే ఉండి సరిగా మ్యానేజ్ చేయలేకపోతే అన్ని చికాకులు ఏకమై తిట్ల దండకం అందుకునే వాళ్లు ఉంటారు.
మొన్నటికి మొన్న ఓ కార్యక్రమంలో ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ ఇలానే చేయడంతో ఆ వీడియో కాస్తా నెటిజనుల్లో జోరుగా వైరల్ అయ్యింది. దాంట్లో మీడియా నుంచి తప్పించుకుంటూనే.. ఈ కుర్రభామ బాడీ గార్డ్స్ ని చెడామడా తిట్టేయడం బయటపడింది. దీంతో ఈ ప్రవర్తన సరికాదు అంటూ నెటిజనులు చీవాట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన రణబీర్ కి తొలి నుంచి ఉండేది. అది తన నుంచే పాకిందేమో! అంటూ కౌంటర్ వేయడం చర్చకు వచ్చింది. ఈ క్లిప్స్ చూశాక ఆలియా డాడ్ మహేష్ భట్ చాలానే కంగారు పడ్డారట. బోయ్ ఫ్రెండ్ యాడయ్యాక మాత్రం అమ్మడి వాలకంలో ఏదో మార్పు కనిపిస్తోందని అంతా అనడం నిశ్చేష్టుల్ని చేస్తోంది.
ఆలియా ప్రస్తుత స్టార్ డమ్ ని ఓ రేంజులో ఎంజాయ్ చేస్తోంది. మూడు పదులు అయినా నిండకుండానే స్కైని టచ్ చేసింది అమ్మడు. ఇలాంటి టైమ్ లో ఈ నిందలేమిటో అంటూ అభిమానులు కలతకు గురవుతున్నారు. తమకు సరిగా సహకరించలేదని ముంబై మీడియా ఇలా యారొగెన్సీ అంటూ ప్రచారం చేస్తోందా? అన్నది ఆలోచించాలి.