Begin typing your search above and press return to search.

RRR పోస్టులు డిలీట్ చేసి రాజమౌళిని అన్-ఫాలో చేసిన అలియా..?

By:  Tupaki Desk   |   28 March 2022 3:34 PM GMT
RRR పోస్టులు డిలీట్ చేసి రాజమౌళిని అన్-ఫాలో చేసిన అలియా..?
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర పట్ల అమ్మడు అసంతృప్తిగా ఉందని.. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో జక్కన్నను అన్ ఫాలో చేసిందని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతోంది.

'ఆర్.ఆర్.ఆర్' విడుదలైనప్పటి నుంచి ఆలియా భట్‌ సినిమా సక్సెస్ గురించి ఇంతవరకు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. కరోనా పాండమిక్ తర్వాత తిరిగి స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా లేదు. ఢిల్లీ జరిగిన ప్రెస్ మీట్ కు మాత్రమే హాజరైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నా.. అలియా మాత్రం దీనిపై స్పందించ లేదు.

దీనికి కారణం సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదనే అని టాక్ నడుస్తోంది. తెలుగులో సీత పాత్రకు అలియా సొంతగా డబ్బింగ్ చెప్పాలని ఆశ పడింది. కానీ చివరకు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ తో వాయిస్ ఇప్పించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆలియా పాత్ర చాలా పరిమితంగా ఉంది.

RRR సినిమాలో ఆలియా కంటే ఒలివియా మోరిస్ స్క్రీన్‌ టైమ్ ఎక్కువ అనే కామెంట్స్ వచ్చాయి. శ్రియ పాత్ర కూడా ప్రభావం చూపింది కానీ.. ఆలియా పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ క్రియట్ చేయలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కేవలం నార్త్ ఇండియాలో మార్కెట్ కోసమే ఆమెని జక్కన్న సినిమాలో భాగం చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌ లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అన్‌ ఫాలో చేసిందని వార్తలు వస్తున్నాయి. అలానే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు సంబంధించిన పోస్టులను కూడా డిలీట్ చేసిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక అలియా ఇన్స్టా ఫీడ్ ని గమనిస్తే.. ఇటీవల కాలంలో RRR పోస్టులు ఏమీ లేవు.

షూటింగ్ లో జాయిన్ అయినప్పుడు రాజమౌళితో తీసుకున్న ఫోటో.. సీత ఫస్ట్ లుక్ పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ 'గంగుబాయి' 'బ్రహ్మాస్త్ర' సినిమాల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళిని అనుసరించకపోవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

నిజానికి ఆలియా 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో భాగం అవడంతో.. సుశాంత్ సింగ్ మరణంతో ఆమెపై వచ్చిన నెగిటివిటీ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా అలియాపై వ్యతిరేకతను కాస్త తగ్గించినట్లు నార్త్ లో వస్తోన్న రెస్పాన్స్ చూస్తే అర్థం అవుతోంది.

ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలు అలియా డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తదుపరి సినిమాలో ఆల్మోస్ట్ కంఫర్మ్ అయినట్లేనని అంటున్నారు. ఇదంతా RRR సినిమా వల్లనే అని చెప్పొచ్చు. కానీ బాలీవుడ్ బ్యూటీ మాత్రం రాజమౌళి పై అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మరి నెట్టింట చెలరేగుతున్న పుకార్లపై అలియా స్పందిస్తుందో లేదో చూడాలి.