Begin typing your search above and press return to search.
బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కూడా డార్లింగ్ ఫ్యానే
By: Tupaki Desk | 2 April 2020 5:00 AM GMTబాహుబలి చిత్రం తర్వాత ఒక్కసారిగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారిపోయిన విషయం తెల్సిందే. అంతకు ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ప్రభాస్ బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో లేడీ ఫాలోయింగ్ ను విపరీతంగా దక్కించుకున్నాడు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో హీరోయిన్స్ కూడా డార్లింగ్ ప్రభాస్ కు ఫ్యాన్ అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ తో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఇంటర్వ్యూ లో టాక్ షో ల్లో చెప్పడం జరిగింది. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ ఆమద్య ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి తనకు ప్రభాస్ పై ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పింది.
ప్రభాస్ ను బాహుబలిలో చూసిన తర్వాత ఇష్టం ఏర్పడినది. సౌత్ హీరోల్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తర్వాత నేను ఆయనకు ఫ్యాన్ అయ్యానంది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు చరణ్ కు జోడీగా నటిస్తూ తనకు డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పడం మెగా ఫ్యాన్స్ ను కాస్త ఇబ్బంది కలిగించే విషయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.