Begin typing your search above and press return to search.

ఫ్యాషన్ ఫేసాఫ్: పూజా హెగ్డే (Vs) ఆలియా భట్

By:  Tupaki Desk   |   24 May 2021 8:30 AM GMT
ఫ్యాషన్ ఫేసాఫ్: పూజా హెగ్డే (Vs) ఆలియా భట్
X
వేస‌వి వారాంతానికి బెస్ట్ ఫ్యాష‌న్ ఎంపిక‌ ఏది? అంటే.. చాలా మంది సెలబ్రిటీలు చెకర్డ్ (గ‌డులు) కో-ఆర్డర్ సెట్ డ్రెస్ ను ధరించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఈ కాట‌న్ డ్రెస్ లో హాయిగా సౌక‌ర్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం వేస‌విలో ఎక్కువగా యూత్ అనుస‌రించిన డిజైన‌ర్ లుక్ ఇదే.

ఈ త‌ర‌హా లుక్ తో ఫ్యాషన్ ఫేస్-ఆఫ్ జాబితాలో ఇద్దరు అద్భుతమైన నటీమణులు ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో సీత‌గా న‌టిస్తున్న‌ అలియా భట్ - అల వైకుంఠ‌పుర‌ములో బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే న‌డుమ ఈ పోటీ. ఆలియా.. పూజా న‌డుమ పోటీ ఆస‌క్తికరం. నీలిరంగు చెకర్డ్ కో-ఆర్డర్ సెట్ లో ఆ ఇద్ద‌రు భామామ‌ణులు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

పూజా హెగ్డే ఇటీవ‌ల ఓ ప్రచార కార్యక్రమంలో గింగ్ హామ్ సహ-ఆర్డ్స్‌లో ప్రధాన రెట్రో వైబ్ ను క‌లిగి ఉంది. ఈ దుస్తులలో బెల్-టైప్ స్లీవ్లు లోతైన నెక్ లైన్ ఉన్న ర్యాప్ క్రాప్ టాప్ - ఫ్లేర్డ్ ప్యాంటు ధ‌రించింది. పూజా తన రూపాన్ని కనీస అలంకరణతో పూర్తిగా ఉంగరాల జుట్టుతో లాక్ చేసింది. ఆమె ఆ డ్రెస్ ని నియాన్ స్ట్రాపీ హీల్స్ తో యాక్సెసరైజ్ చేసింది.

అలియా భట్ తన నీలిరంగు చెకర్డ్ కో-ఆర్డర్ సెట్ ను ధ‌రించి సన్ గ్లాసెస్ తో స్టైల్ చేయడంతో స్పెష‌ల్ గా కనిపించింది. సాధ్యమైనంత ఉత్తమంగా సింపుల్ గా చిక్ లుక్ తో క‌నిపించింది. ఆ ఇద్ద‌రి లుక్ లో ఏది బెస్ట్ అన్న‌ది మీరే ఎంపిక చేయండి! ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రూ నాలుగైదు చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.