Begin typing your search above and press return to search.
చలి చంపేసినా సీన్ వేడి పుట్టించింది
By: Tupaki Desk | 12 Sep 2015 10:30 PM GMTకుర్ర హీరోయిన్ అలియాభట్ కు బికినీ వేయడం కొత్తేమీ కాదు. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లోనే బికినీలో రెచ్చిపోయింది. టూపీస్తో యువ లోకాన్ని తనవైపునకు తిప్పుకుంది. ప్రస్తుతం యూత్ లో అలియా అంటే ఓ రకమైన వైబ్రేషన్స్ పుట్టుకొస్తాయి. అందుకే ఆ భామ ఛాన్స్ దొరికిన ప్రతిసారీ బికినీ అంటే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటీవల షాన్ దార్ సినిమాలో కూడా బికినీ వేసింది. కానీ ఈ బికినీ మాత్రం జీవితాంతం గుర్తిండిపోయే ఓ చేదు అనుభవాన్ని మిగిల్చిందిట పాపం!
గడ్డ కట్టించే చలిలో తడిసి ముద్దైన బికినీ వేసుకుంటే ఎలా ఉంటుంది? రోమాలు జిల్లని ఒక్కసారిగా నిక్కబొడిచి తిరిగి చచ్చుబడిపోతాయి. ఇలాంటి రేర్ ఇన్సిడెంట్ని అలియా ఫేస్ చేయాల్సి వచ్చింది. మైనస్ 2 డిగ్రీల చలిలో బికినీ వేసుకుని నడుచుకుంటూ వస్తూంటే నరకంలోకి వెళ్లొచ్చినట్టే అనిపించింది. అస్సలు చలిని తట్టుకోలేకపోయాను. కానీ సీన్ మాత్రం బాగా రావడంతో ఆ బాధను మర్చిపోయాననుకోండి. ఇందులో హీరోగా నటించిన షాహిద్ కపూర్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సీన్ లో బనియన్ షార్ట్ వేసుకుని నటించా. మగాడిని నేనే ఆ చలిని తట్టుకోలేకపోయాను. అలియా గురించి ఆ దేవుడికే తెలియాలంటున్నాడు.
అయితే వయసు మిసమిసలో ఉన్న ఈ ఇద్దరు ఈ సీన్ లో కలిసి నటించినప్పుడు మాత్రం పుట్టే వేడి అగ్నిపర్వతం నుంచి పుట్టే లావాలా మరిగి ఉంటుంది. ఇటీవలే షాహిద్ మీరా రాజ్పుత్ని పెళ్లాడాడు కాబట్టి పెళ్లయిన వాళ్లపై నో కామెంట్ ప్లీజ్!