Begin typing your search above and press return to search.
ఫిలింఫేర్ లో RRR బ్యూటీ హవా
By: Tupaki Desk | 24 March 2019 4:49 AM GMT64వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం సాయంత్రం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ అవార్డుల్ని RRR బ్యూటీ క్లీన్ స్వీప్ చేసేసింది. పద్మావతి పాత్రలో నటించిన దీపిక పదుకొనేని కాదని `రాజీ`గా స్పై పాత్రలో అదరగొట్టేసిన ఆలియాకు ఉత్తమ కథానాయికగా అవార్డ్ వరించింది. ఈ పురస్కారాల్లో రాజీ హవా స్పష్టంగా కనిపించింది. చిల్లు బుగ్గలతో ఆలియా మ్యాజిక్ ఫిలింఫేర్ ఆద్యంతం వెలుగులు పంచింది.
ఇక ఇదే వేదికపై ఆలియాతో పాటుగా తన బోయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకోవడం హైలైట్. సంజయ్ దత్ జీవితకథతో తెరకెక్కించిన `సంజు` చిత్రంలో టైటిల్ పాత్రలో జీవించినందుకు అతడికి ఈ పురస్కారం దక్కింది. పద్మావత్ 17 కేటగిరీల్లో పోటీపడితే, అంతకంటే తక్కువ కేటగిరీల్లో పోటీపడిన రాజీ మెజారిటీ అవార్డుల్ని కైవశం చేసుకుంది. ఉత్తమ దర్శకులు కేటగిరీలో రాజీ ఫేం మేఘన గుల్జార్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఫిలింఫేర్ -ఉత్తమ సినిమా గానూ రాజీ పురస్కారం దక్కించుకుంది. పద్మావత్ లో ఖిల్జీ పాత్ర పోషించిన రణవీర్ సింగ్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ ని గెలుచుకున్నాడు. బదాయి హో లో గర్భవతి అయిన నడివయస్కురాలిగా నటించిన నీనా గుప్తాను క్రిటిక్స్ ఉత్తమ నటి పురస్కారం దక్కింది.
ఫిలింఫేర్ వేదిక ఆద్యంతం కళ్లన్నీ ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాపైనే. ఈ యంగ్ బ్యూటీ బ్లాక్ & పర్పుల్ డ్రెస్ లో అదరగొట్టేసింది. ఎస్.ఎస్.రాజమౌళి అంతటివాడే .. 'బాలీవుడ్ లో అదరగొట్టేస్తున్నావ్.. అందరినీ వెనక్కి నెట్టేస్తున్నావట! ఆర్.ఆర్.ఆర్ సెట్స్ కి నీ రాకకై వేచి చూస్తున్నాను!' అని పొగిడేశారంటే అది ఎందుకో ఇప్పుడైనా అర్థమైందా?