Begin typing your search above and press return to search.

తార‌క్ స‌ర‌స‌న ఎట్ట‌కేల‌కు ఆలియా ఫిక్స్

By:  Tupaki Desk   |   30 Jan 2022 9:30 AM GMT
తార‌క్ స‌ర‌స‌న ఎట్ట‌కేల‌కు ఆలియా ఫిక్స్
X
బాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది ఆలియాభ‌ట్. వ‌రుస‌గా తాను న‌టించిన సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్- బ్ర‌హ్మాస్త్ర‌- గంగూభాయి క‌తియావాడీ చిత్రాలు రేస్ లో సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆలియా త‌దుప‌రి ప్రాజెక్టుల‌ను ప్రారంభించే ప‌నిలో ఉంది. ఈలోగానే క్రేజీగా టాలీవుడ్ నుంచి మ‌రో ఆఫ‌ర్ అందుకుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ఈసారి గోల్డెన్ ఛాన్స్.

ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన ఆలియాను వెంట‌నే తార‌క్ లాక్ చేశాడు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలోని #NTR30లో న‌టిస్తోంద‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతున్నా ఇన్నాళ్లు క‌న్ఫామ్ కాలేదు. ఎట్ట‌కేల‌కు తార‌క్ కోసం కాల్షీట్లు ఇచ్చేసింద‌ని తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా ప్రారంభం కానుండ‌గా నటీనటులు సాంకేతిక‌ సిబ్బందిని ఫైన‌ల్ చేసారు దర్శ‌కుడు. ఆలియా ఇప్ప‌టికే క‌థానాయిక‌గా సంత‌కం చేయ‌గా... కొత్త‌త‌రం సాంకేతిక నిపుణుల‌తో కొర‌టాల ప‌ని చేయ‌నున్నారు.

RRRలో రామ్ చరణ్ సరసన నటించిన ఆలియా చ‌ర‌ణ్-తార‌క్ ల‌తో క‌లిసి ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంది. అటు హిందీ కార్య‌క్ర‌మాల‌కు ఈ ముగ్గురూ అతిథులుగా వెళ్లారు. ఇక ఆలియా ఎంతో ఫ్రెండ్లీ. ఇద్ద‌రు స్నేహితుల‌తో ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయింది. అందుకే ఇప్పుడు తార‌క్ తో ఆఫ‌ర్ ని కాద‌న‌లేక‌పోయింద‌ట‌. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మునుముందు తెలుగు అగ్ర హీరోలు అల్లు అర్జున్ .. ప్ర‌భాస్ ల స‌ర‌స‌న ఆలియా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.