Begin typing your search above and press return to search.
తారక్ - చరణ్ లపై అలియా ఫన్నీ కామెంట్స్..!
By: Tupaki Desk | 11 Dec 2021 11:31 AM GMTబాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో. యావత్ సినీ అభిమానులు వేచి చూస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా ఈరోజు శనివారం హైదరాబాద్ లో వాలిపోయింది.
RRR టీమ్ ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొనడానికి అలియా షూటింగ్ వాయిదా వేసుకొన మరీ వచ్చింది. రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ లతో కలిసి.. తెలుగు మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. 'ఎలా వున్నారు? మీరు బాగున్నారా?' అంటూ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. ట్రైలర్ పగిలిపోయింది అంటూ నవ్వులు పూయించింది.
''RRR ట్రైలర్ పగిలిపోయింది కదా. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది. రాజమౌళి సర్ సినిమాలో నటించడం నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. ఆ కల నెరవేరడంతో కరోనా సమయంలోనూ షూటింగ్ చేయడానికి రెడీ అయ్యాను. క్లిష్ట పరిస్థితుల్లోనూ టీమ్ మొత్తం కష్టపడి పనిచేయడం చూసి నేనెంతో స్ఫూర్తి పొందాను. మరోసారి ఛాన్స్ వస్తే తప్పకుండా రాజమౌళి సర్ తో వర్క్ చేయాలని ఉంది'' అని చెప్పుకొచ్చింది అలియా.
ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. ఇద్దరూ మంచి నటులని.. వాళ్లతో కలిసి పనిచేయడం తనకు బాగా నచ్చిందని తెలిపింది. వారి నుంచి ఎన్నో నేర్చుకున్నానని.. తనకు మంచి భోజనం రుచి చూపించారని ఆలియా చెప్పింది. "నేను సెట్స్ లో ఉన్నప్పుడు చరణ్ - తారక్ ఒకరితో ఒకరు తెలుగులో జోక్స్ వేసుకునేవారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని లాక్కునేవారు. ఎప్పుడూ సరదా సరదాగా ఉండేవారు. వారి స్నేహ బంధం గొప్పది. నేను అక్కడ ఉన్నాననే ఆలోచనే వారికి లేదు'' అంటూ ఇద్దరూ తనను పట్టించుకోలేదని అలియా సరదాగా చెప్పుకొచ్చింది.
RRR సినిమా కోసం ఒక ఏడాది పాటు అక్షయ్ అనే ట్యూటర్ దగ్గర తెలుగులో ట్రైనింగ్ తీసుకున్నానని.. ఒక ఏడాదంతా జూమ్ కాల్ లోనే తెలుగు నేర్చుకున్నానని అలియా తెలిపింది. బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబర్చరనే దానిలో నిజమెంత?' అనే ప్రశ్నకు సమాధానంగా.. ''అందులో నిజం లేదు. సౌత్ సినిమా.. ముఖ్యంగా జక్కన్న సినిమాలో చేయాలనేది నా లైఫ్ టైమ్ డ్రీమ్. చాలామంది హీరోయిన్లు అలాగే అనుకుంటున్నారు. మంచి కథ వస్తే తప్పకుండా ఇక్కడ కూడా నటిస్తారు'' అని వెల్లడించింది.
తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ మరియు RRR ని ఉద్దేశిస్తూ 'మీ లైఫ్ లో ‘R’ అనే లెటర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది కదా?' అని ప్రశ్నించగా.. ''ఐ లవ్ RRR'' అని ఆలియా సమాధానమిచ్చింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ అలియాను పొగడగా.. 'వాళ్లిద్దరికీ బిర్యానీ ఇప్పించాను. అందుకే ఇద్దరూ నా గురించి బాగా మాట్లాడతారు' అని నవ్వేసింది అలియా.