Begin typing your search above and press return to search.

ఆలియా గంగూభాయి క‌తియావాడీ OTT డేట్

By:  Tupaki Desk   |   20 April 2022 6:30 AM GMT
ఆలియా గంగూభాయి క‌తియావాడీ OTT డేట్
X
ఇటీవ‌లే ప్రియుడు ర‌ణ‌బీర్ కపూర్ ని పెళ్లాడి కొత్త జీవితంలోకి ప్ర‌వేశించింది ఆలియాభ‌ట్. బ్యాక్ టు బ్యాక్ గంగూభాయి క‌తియావాడీ- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో విజ‌యాలు అందుకుని ఆనందోత్సాహాల న‌డుమ ర‌ణ‌బీర్ తో సంసార జీవ‌నంలోకి అడుగుపెట్టింది.

అలియా భట్ నటించిన ఆ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు నెల‌ల‌ వ్య‌వ‌ధిలోనే ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. గంగూబాయి కతియావాడి ఏప్రిల్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అలాగే జూన్ 3న ఆర్.ఆర్.ఆర్ కూడా ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

అభిమానుల నుండి విపరీతమైన ప్రేమ ను ద‌క్కించుకుని విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకున్న గంగూబాయి కతియావాడి ని ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జ‌నం థియేట‌ర్ల‌లో మిస్స‌య్యార‌న్న టాక్ ఉంది. అయితే ఏప్రిల్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో గంగూభాయి ట్రీట్ అందుబాటులోకొస్తోంది. గంగూబాయి కతియావాడి ఈ సంవత్సరం అత్యంత పాపుల‌ర్ భారతీయ చిత్రాలలో ఒకటి గా నిలిచింది. భారతదేశం స‌హా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇక‌పై ఓటీటీలో ఆనందించగలర‌ని టీమ్ ఆశిస్తోంది. S. హుస్సేన్ జైద్ రచించిన- మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా గంగూబాయి కతివాడి కథను రాసారు.

గుజరాత్ లోని ఒక చిన్న పట్టణమైన కతియావాడ్ కు చెందిన ఒక సాధారణ అమ్మాయి ఎదుగుదల చుట్టూ తిరిగే క‌థాంశ‌మిది. ఆమెకు జీవితం విసిరిన స‌వాళ్ల‌ను స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. వేశ్యా వాటిక నేప‌థ్యంలో రాజ‌కీయం అనేది ఆస‌క్తిని రేకెత్తించే అంశం. చలనచిత్రం థియేట‌ర్ల‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆక‌ట్టుకుంది. సంగీతం- క‌ళ స‌హా అన్ని భావోద్వేగాలను రేకెత్తించే విజుబిలిటీతో మెప్పించింది. సంజయ్ లీలా భ‌న్సాలీ రచన - దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భ‌న్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించింది.

గంగూబాయి కతియావాడి ద‌ర్శ‌క‌నిర్మాత సంజయ్ లీలా భ‌న్సాలీ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న తన చిత్రం గురించి మాట్లాడుతూ - “గంగూబాయి కతియావాడి నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా దానికి లభించిన అద్భుతమైన స్పందన చూసి మేము గర్విస్తున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులను తిరిగి థియేటర్ లకు వచ్చేలా ప్రోత్సహించినా కానీ, ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో భారతదేశం స‌హా ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోనుండ‌డంపై నేను సంతోషిస్తున్నాను`` అని అన్నారు.

నెట్ ఫ్లిక్స్ అధినేత‌లు మాట్లాడుతూ-``భారతదేశంలో చలనచిత్రాలు ఒక ఇష్టమైన వినోద రూపంగా ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ లో స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే క్లాస్ సినిమాలలో ఉత్తమమైన చిత్రాలను అందించాల‌ని మేం కోరుకుంటున్నాము. మేము మా చిత్రాల ప‌రిధిని విస్తరింపజేస్తాం. అసలైన లైసెన్స్ పొందిన చిత్రాల వ‌రుసలో.. ఐకానిక్ చిత్రం గంగూబాయి కతియావాడి త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుండ‌డంపై మేం సంతోషిస్తున్నాము. సంజయ్ లీలా భ‌న్సాలీ అద్భుతంగా తెర‌కెక్కించారు. అలియా భట్- అజయ్ దేవగన్ అనేక ఇతర శక్తివంతమైన తార‌లు న‌టించారు. ఇది చిరస్మరణీయమైన సినిమాగా నిలిచింది. మా నెట్ ఫ్లిక్స్ మెంబ‌ర్స్ ఈ కళాఖండాన్ని ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము`` అని అన్నారు.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం మరియు రచన, గంగూబాయి కతియావాడిని బన్సాలీ ప్రొడక్షన్స్ మరియు డాక్టర్ జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) నిర్మించారు, ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, జిమ్ సర్భ్, శాంతను మహేశ్వరి, విజయ్ రాజ్, వంటి నటీనటులు విశేషమైన శ్రేణిని కలిగి ఉన్నారు. ఇందిరా తివారీ, సీమా భార్గవ తదితరులు ఉన్నారు.