Begin typing your search above and press return to search.

18సం.లు విలువ లేనివాడితో కాపురం చేసాను! న‌టుడి భార్య ఆరోప‌ణ‌!!

By:  Tupaki Desk   |   12 Feb 2023 2:00 PM GMT
18సం.లు విలువ లేనివాడితో కాపురం చేసాను! న‌టుడి భార్య ఆరోప‌ణ‌!!
X
తనదైన విల‌క్ష‌ణ నటన‌తో అసంఖ్యాకంగా అభిమానుల‌ను సంపాదించిన ట్యాలెంటెడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. కొంత కాలంగా భార్య ఆలియా సిద్ధిఖీతో కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రాంగ్ రీజ‌న్స్ తో అత‌డు మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. త‌న‌తో 18 సంవ‌త్స‌రాల పాటు అనుబంధం పంచుకున్న భార్య ఈరోజు అత‌డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అత‌డు పిల్ల‌ల‌ను స‌రిగా చూసుకోడ‌ని.. తిండికి లేని ద‌రిద్రంలో ఉన్న అత‌డిని తానే ఆదుకున్నాన‌ని.. ఒకే గ‌దిలో మ‌రిది భ‌ర్త‌తో పాటు క‌లిసి జీవించాన‌ని ఆలియా తెలిపారు. ముఖ్యంగా న‌వాజుద్దీన్ తిండికి లేని స్థితి నుంచి కార్ కొనుక్కోలేని ధైన్యం నుంచి అత‌డు స్టార్ గా ఈ స్థాయికి ఎదిగాడ‌ని కూడా నిజాలు చెప్పిన అత‌డి భార్యామ‌ణి కొన్ని తీవ్ర‌మైన ఆక్షేప‌ణ‌ల‌తో కూడుకున్న ఫిర్యాదులు చేసింది.

ఆలియా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబం గురించి కొన్ని షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసింది. శుక్రవారంనాడు త‌న‌ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుద‌ల చేసింది. త‌మ సొంత ఇంటి గేటు వ‌ద్ద‌ ఆలియా - నవాజుద్దీన్ వాదించుకోవడం ఈ వీడియోలో క‌నిపించింది. కొన్ని ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ.. ఆలియా ఇలా రాసింది. నా దృష్టిలో పూర్తిగా విలువ లేని వ్యక్తి కోసం నా 18 సంవత్సరాలు వెచ్చించినందుకు నేను చింతిస్తున్నాను.. అని వ్యాఖ్యానించింది.

మొదట నేను అతడిని 2004లో కలిశాను. మేం ఇద్దరం క‌లిసి జీవించాం. అతను ఏక్తా నగర్- చార్కోప్- మ్హాదా- ముంబయిలో ఉన్న సమయంలో అక్కడ అతను- నేను.. అతని సోదరుడు Mr. షమాసుద్దీన్ సిద్ధిఖీ ఒక సింగిల్ గదిలో కలిసి ఉండేవాళ్ళం. అక్కడ మేము కలిసి ప్రయాణం ప్రారంభించాం. చాలా సంతోషంగా జీవించాము. అతను నన్ను ప్రేమించాడు .. దీర్ఘాయువు కోసం నన్ను సంతోషంగా ఉంచుతాడు.

తన దగ్గర తిండికి సరిపడా డబ్బు కూడా లేక‌పోవ‌డంతో నేను అత‌ని సోదరుడు వ్యక్తిగత లాభాపేక్ష చూడ‌కుండా ఇంటిని న‌డిపించామ‌ని ఆలియా పేర్కొంది. ''ఈ మనిషి(న‌వాజ్) ఎప్పుడూ గొప్ప మనిషి కాదు. అతను ఎల్లప్పుడూ తన మాజీ-జీఎఫ్.. అతని మాజీ భార్యను అగౌరవపరిచాడు. ఇప్పుడు నన్ను అగౌరవపరిచాడు. అత‌డు పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు.. అని ఆరోపించింది. ''ఈ వ్యక్తి నన్ను తన జీవిత భాగస్వామిగా పేర్కొన్నాడని ప్రతి ప‌త్రం సాక్ష్యంగా నిలిచిన‌ప్పుడు ఇంతగా దిగజారడం ఎలా సాధ్యం?'' అని ప్ర‌శ్నించింది. 'జస్టిస్ టు గెయిల్' అని ఆమె తన పోస్ట్ ను ముగించింది.

న‌వాజ్ అతడి కుటుంబ సభ్యులపై ముంబై-అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టులో IPC సెక్షన్ 498A కింద ఆలియా కేసుపెట్టింది. భర్త లేదా భర్త తాలూకా బంధువులు తనను క్రూరంగా వేధించి అవ‌మానించినంద‌న IPC 509 కేసును పెట్టింది. నవాజుద్దీన్ తల్లి మెహ్రునిసా ఫిర్యాదు చేసిన అనంత‌రం ఆలియా ఈ ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసింది. తనపై ఉన్న అక్రమాస్తుల ఎఫ్‌.ఐ.ఆర్ ను రద్దు చేయాలంటూ ఆలియా బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై ఫిబ్రవరి 20న విచారణ జరగనుంది. తాను నవాజుద్దీన్ సిద్ధిఖీకి విడాకులు ఇవ్వాలని భావిస్తున్నానని .. తన పిల్లల సంరక్షణ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తమ రెండవ బిడ్డను న‌వాజ్ తిరస్కరించాడని కూడా ఆమె పేర్కొంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ అతని కుటుంబం తనకు ఆహారం- నిద్ర .. బాత్రూమ్ స‌హా ప్రాథమిక అవసరాలు లేకుండా చేశార‌ని.. విశ్రాంతి గదిలోకి ప్రవేశం కల్పించలేదని ఆలియా ఆరోపించింది. తాను త‌న‌ పిల్లలు నవాజ్ నిర్మించుకున్న విలాస‌వంత‌మైన‌ ముంబై భ‌వంతిలో కేవ‌లం ఒక‌ గదికి పరిమితమయ్యామ‌ని ఆరోపించింది. ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇప్పటివరకు దీనికి అధికారికంగా కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.