Begin typing your search above and press return to search.
#RRR షూట్.. ఆలియా టూమచ్ కాస్ట్ లీ గురూ
By: Tupaki Desk | 7 Dec 2020 9:37 AM GMTముంబై నుంచి కథానాయికల్ని బరిలో దించడం అంటే అది సవాళ్లతో కూడుకున్నదే. హైదరాబాద్ లో ఖరీదైన స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలి. దానికి తోడు సదరు నాయికతో పాటే వచ్చే బంధువులు అసిస్టెంట్లకు అన్నిటినీ ఇవ్వాలి. ఇదంతా నిర్మాతకు తడిసి మోపెడయ్యే వ్యవహారమే.
అన్నట్టు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ కోసం ఇంతకుముందే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిపోయిన ఆలియాకు నిర్మాతల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే జబర్ధస్త్ గా ఇప్పటికే బస ఏర్పాటైందిట. అయితే తనతో పాటే ఉండే స్టాఫ్ కి రోజుకు ఎంత ఖర్చవుతుంది? అంటే కళ్లు భైర్లు కమ్మే నిజం తెలిసింది. స్టాఫ్ కి ఆలియా జీతాలిచ్చుకున్నా కానీ.. నిర్మాత నుంచి ప్యాకేజీలో అవన్నీ కలిసిపోతాయన్నది ఇన్ సైడ్ గుసగుస. రోజువారీగా ఈ స్టాఫ్ కి ఏకంగా లక్ష ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఆలియా వస్తూనే షూటింగ్ లో పాల్గొనబోతోందిట. ఇప్పటికే జరుగుతున్న షెడ్యూల్ లో చరణ్-తారక్ బృందంతో చేరిపోనుంది. ఇక ఆలియా కాల్షీట్లు చాలా కాస్ట్ లీ. ఎన్నిరోజులు ఉంటే అన్నిరోజులు చెమటలే. స్టాఫ్ ఖర్చులు మామూలుగా ఏమీ ఉండవు. అందుకే డేస్ వేస్ట్ అవ్వకుండా వెంటనే చకచకా చిత్రీకరణ పూర్తి చేసేస్తున్నారట. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.