Begin typing your search above and press return to search.
ఆలియా ఆటో ఎక్కారు సరే కానీ పెద్దాయన గొడుగ పట్టడమే బాలేదు!
By: Tupaki Desk | 18 Aug 2021 6:20 AM GMTనేటితరం కథానాయికల్లో జోరు మీదున్న ఆలియా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో భారీ పారితోషికం అందుకుంటున్న టాప్ 10 స్టార్లలో తన పేరు ఎప్పుడూ ఉంటుంది. ఇక తనకు ఉన్న ఖరీదైన కార్లు అస్సెట్స్ వందల కోట్లు విలువ చేస్తాయి.
ఇక విలాసాల భవంతిలో ఆలియా నివాసం వయసుకు మించిన ఆర్జనతో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే అంతటి ఖరీదైన రాకుమారి ఉన్నట్టుండి ఆటో ఎక్కింది. తన ఖరీదన స్వాంకీ కార్ ని వదిలేసి ఆటో రైడ్ లో వెళ్లింది. అయితే ఆలియా ఆటో రైడ్ కి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. ముంబై నగరంలో చాలా సార్లు ఇలా తనకు ఆటో రిక్షా ప్రయాణంపై ఉన్న మక్కువను చాటుకుంది.
ఆలియా ఏదో పని మీద సిటీలో రైడ్ కి వెళ్లింది. ఈ ప్రయాణంలో ఉబెర్ కూల్ ఫ్యాషన్ కు మరో క్లాసిక్ ఉదాహరణగా నిలిచి ఆలియా అందరి దృష్టిని ఆకర్షించింది. నట్టనడి వీధుల్లో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆలియా వెర్సోవా జెట్టీకి చేరుకున్నప్పుడు ఆటో బయట అడుగుపెడుతున్న ఫోటోలు ఇప్పుడు వెబ్ ని ముంచెత్తాయి. ఆలియా లేత నీలిరంగు చినుగుల డెనిమ్ జీన్స్ ధరించింది. తెల్లని స్లీవ్ లెస్ క్రాప్ టాప్ ధరించి కనిపించింది. మినిమలిస్ట్ మేకప్ తో అలియా సింపుల్ గా సొగసరిగా కనిపించింది. చంకీ వైట్ స్టెయిన్ లెస్ బూట్లు.. పోనీటెయిల్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించింది.
ఆలియా రిక్షాలో ప్రయాణించడం అభిమానులు చూడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె ఆటో రైడ్ పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ రైడ్ అనంతరం సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఈసారి కూడా మరో రిక్షా సెషన్ ఫోటోను షేర్ చేస్తూ.. ``నాకు ఇష్టమైన రైడ్... రిక్షా రైడ్ `` అంటూ వ్యాఖ్యను జోడించింది. అన్నట్టు .. ఆలియా ఆటో ఎక్కారు సరే కానీ పెద్దాయన గొడుగ పట్టడమే బాలేదు! అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. విషయం ఏమంటే ముంబైలో వర్షాల వల్ల తన కార్ ని మార్గమధ్యంలో ఆపేయాల్సొచ్చింది. ఆ తర్వాత ఆలియా ఆటోని ఆశ్రయించారు. అలాగే తనకు గొడుగు పట్టేందుకు సెక్యూరిటీ పెద్దాయన తన వెంట వచ్చారు. మ్యాడమ్ ఆటో ఎక్కి సింప్లిసిటీ ప్రదర్శించినా పెద్దాయనతో గొడుగు పట్టించుకోవడం మానేయలేదు అనేది తనను అంటున్న వారి తాత్పర్యం. అలా గొడుగు పట్టాల్సిన అవసరం ఏం ఉంది? తన చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా! అని అడిగేస్తున్నారు కొందరైతే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అలియా భట్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆర్.ఆర్.ఆర్ సహా గంగుబాయి కాతియావాడి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా` రోడ్ ట్రిప్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్ - కత్రినా కైఫ్ తో పాటు ఆలియా భట్ కూడా నటించనుంది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఆలియా స్వీయనిర్మాణంలోని డార్లింగ్స్ లో కూడా ఆమె నటించనుంది. భన్సాలీ తెరకెక్కించనున్న డిజిటల్ సిరీస్ హీరామండిలోనూ ఆలియాకు అవకాశం దక్కింది. ఇది వేశ్యాగృహాల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా అత్యంత భారీగా తెరకెక్కనున్న సిరీస్ గా పాపులరవుతోంది.