Begin typing your search above and press return to search.
బన్నీ బాడీ లాంగ్వేజ్ కి అలియాభట్ ఫిదా!
By: Tupaki Desk | 26 March 2022 5:05 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే స్టైలిష్ స్టార్ అయ్యాడు. అంతటి ఘనకీర్తిని అందుకోవడం వెనుక స్టార్ మేకర్స్ సుకుమార్..పూరి జగన్నాధ్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీ లో యాక్టింగ్ ట్యాలెంట్ తో పాటు..తనకంటూ ఓ స్టైలిష్ ఐడెంటీటీ దక్కిందంటే దానికి కారణం ఆ ఇద్దురి దర్శకులే.
`ఆర్య-2` నుంచి వెండి తెరపై సరికొత్త బన్నీని చూస్తున్నాం. `జులాయి` ..`ఇద్దరమ్మాయి లతో`..`సన్నాఫ్ సత్యమూర్తి`..`నాపేరు సూర్య`.. `అల వైకుంఠపురములో` లాంటి చిత్రాల్లో బన్నీ ఫ్రెష్ లుక్ లో ఆకట్టుకున్న వైనం సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
ఓ వైపు నటుడిగా షైన్ అవుతూనే మరోవైపు స్టైలింగ్ న్యూ ట్రెండ్ లోనూ మెప్పించడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. బన్నీని స్టైలిష్ స్టార్ గా ఎలివేట్ చేయడం వెనుక తనలో ఆ క్వాలిటీ కూడా కీలక పాత్ర పోషించిదని చెప్పొచ్చు. ఓ వైపు కమర్శియల్ చిత్రాల్లో మాస్ పాత్రల్లో మెప్పిస్తూనే క్లాస్ రోల్స్ తోనూ ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నారు.
టాలీవుడ్ లో ఎంత పోటీ ఉన్నా బన్నీ తనకంటూ ఓ ఐడెంటీని..ఓ మార్గాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగుతున్నాడు. స్టైలింగ్ విషయంలో బన్నీ -సుకుమార్ ని ఓ గురువులా భావిస్తుంటారు. ఈ మాట ఓ సందర్భంలో బన్నీనే స్వయంగా చెప్పారు. తాజాగా బన్నీ స్టైలిష్ పెర్పార్మెన్స్ గురించి బాలీవుడ్ నటి అలియాభట్ ఆకాశానికి ఎత్తేసింది.
`అల్లు అర్జునే ఓ స్టైల్. అతను ధరించే కాస్ట్యూమ్స్ లోనో.. వేసే డాన్సుల్లోనే .. స్టైల్ గా ఉండాలనే ఉత్సాహమో అతన్ని స్టైలిష్ స్టార్ ని చేయలేదు. ఆ రకంగా స్టైలిష్ లుక్ రాలేదు. అతని బాడీ లాంగ్వేజ్ లోనే ఓ స్టైల్ ఉంది` అని కితాబిచ్చింది. బన్నీ లుక్ పరంగా` గంగోత్రి`..`ఆర్య` తర్వాత చాలా మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో అలియాభట్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. సీతమ్మ పాత్రలో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఆరంభంలోనే తొలి పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. అంతకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గానూ ఛాన్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో అలియా వేగం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే `గంగూబాయి కతియావాడి`తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది.