Begin typing your search above and press return to search.

ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   16 Feb 2022 1:30 AM GMT
ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా అనగానే కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం అద్బుతమైన కళా ఖండాలు ఉన్నాయి. అందుకే ఆలియాతో ఆయన మరో అద్బుతంను ఆవిష్కరిస్తాడనే అంతా అనుకుంటున్నారు.

ఆలియా భట్‌ ను గంగూబాయి గా చూపిస్తూ ఆయన తెరకెక్కించిన గంగూబాయి కతియావాడి చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా వల్ల దాదాపు ఏడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ఈనెల 25వ తారీకున రాబోతుంది. ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదల నేపథ్యంలో భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ హైప్ కు తగ్గట్లుగా సినిమా ఉంటుందంటూ మేకర్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆలియా భట్ కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తెలుగు లో కూడా ఈ సినిమా ను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమయంలో గంగూబాయ్ సినిమాను గురించి ఆలియా భట్‌ ఆసక్తికరంగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ఒక 50 ఏళ్ల వృద్దురాలి సినిమా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

కాని వారు అనుకునేది తప్పు. సినిమా గురించి వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రమోషన్‌ స్టఫ్‌ లో ఎక్కువగా ఆలియా భట్ ను పెద్ద ఏజ్‌ మహిళగా చూపించడం వల్ల అలాంటి ఒక అభిప్రాయం పడిపోయింది.

సినిమా ఒక రియల్‌ లైఫ్‌ లేడీ కి సంబంధించిన కథతో రూపొందిన విషయం తెల్సిందే. ఆ లేడీ కథ అనగానే అంతా కూడా హీరోయిన్‌ 50 ఏళ్ల వయసు వృధ్దురాలిగా కనిపిస్తుందని అంతా అనుకున్నారు. ఆ అభిప్రాయం బలపడేలా ట్రైలర్‌ మరియు పోస్టర్స్ ఉన్నాయి. కాని తాజాగా ఆలియా భట్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

సినిమా జనాలు అనుకున్నట్లుగా ఉండదని తప్పకుండా ఒక మంచి కమర్షియల్‌ మూవీగా ఉంటుందని బాలీవుడ్‌ విశ్లేషకులు అంటున్నారు. ఆలియా భట్ ఈ సినిమా లో వేశ్య గంగూబాయ్ పాత్రలో కనిపించబోతుంది.

గంగూబాయ్ ఒక వేశ్యగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత తన తోటి వారి అభ్యున్నతి కోసం రాజకీయాల్లో అడుగు పెడుతుంది. అప్పుడు ఆమెకు ఎదురైన అనుభవం ఏంటీ అనేది సినిమా కథ. ఈనెల 25న భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.