Begin typing your search above and press return to search.
పెళ్లి వేడుకలో కళ్లన్నీ ఆలియాపైనే!
By: Tupaki Desk | 22 Nov 2021 1:30 AM GMTబాలీవుడ్ లో షాదీ ఫీవర్ విజృంభిస్తోంది. కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు.. రాజ్ కుమార్ రావ్ - పత్రలేఖ చండీగఢ్ లో వారి విలాసవంతమైన వేడుకతో వివాహ లక్ష్యాలను నిర్ధేశించారు. ఇక ఇప్పుడు ఆదిత్య సీల్.. అనుష్క రంజన్ ఈరోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత రాత్రి అనుష్క- ఆదిత్య వారి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం గరిష్టంగా నగరంలో సూపర్ సంగీత్ వేడుక జరిగింది. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ కు విచ్చేసి స్టారీగా మార్చారు. ఆలియా భట్- క్రిస్టల్ డిసౌజా.. వాణి కపూర్.. భాగ్యశ్రీ.. రవీనా టాండన్.. భూమి పెడ్నేకర్ తదితరులు తమ అత్యుత్తమ వేషధారణలతో మైండ్ బ్లాక్ చేశారు. అయితే ఆలియా భట్ తనదైన మోడ్రన్ స్టైల్ లెహంగా-చోళీలో షో స్టాపర్ గా నిలిచింది.
సరిగ్గా చెప్పాలంటే నెటిజనులు జీర్ణించుకోవడానికి చాలా కష్టపడిన చోళీ ఇది. ఇది క్రాస్ నెక్డ్ బ్లౌజ్ ఓపెన్ బ్యాక్. ఆలియా మైండ్ బ్లోయింగ్ లుక్ తో మతులు చెడగొట్టింది అంటూ అక్కడ చర్చ సాగింది. బ్రహ్మాస్త్ర నటి లైమ్-గ్రీన్ పింక్ లెహంగా ధరించి ఇతర నాయికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆదిత్య సీల్ - అనుష్క రంజన్ సంగీతం నుండి అలియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ఫ్యాషన్ ఔత్సాహికులు ఆమె స్టైలింగ్ ను ఇష్టపడుతుండగా నెటిజనులు ఆమె ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ లో కూడా ఇలా చేస్తుందా? అంటూ క్రూరంగా ట్రోల్ చేశారు.
సాంప్రదాయ వస్త్రధారణకు RIP అని ఒకరు పంచ్ విసిరారు. మరో సోషల్ మీడియా యూజర్ ఫ్యాషన్ డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టు.. మిస్ అలియా భట్ అని వ్యాఖ్యానించారు. నెటిజనుల్లో ఒకరు ఆమెను బిగ్ బాస్ OTT ఉర్ఫీ జావేద్ తో పోల్చారు. ఆమె ఉర్ఫీ జావేద్ లాగా ఉంది. మరో అభిమాని ``యే అలియా నే క్యా ఫెనా హై?? ఫ్యాషన్ కే నామ్ పర్ కుచ్ భీ`` అని రాశాడు. కొందరు వాంతి చేసే ఎమోటికాన్ లను కూడా షేర్ చేశారు. మొత్తానికి రోజంతా ఆలియా గురించే వాడి వేడిగా చర్చ సాగింది.