Begin typing your search above and press return to search.

సర్దార్ గురించి కామెంట్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   2 May 2016 12:13 PM GMT
సర్దార్ గురించి కామెంట్ చేస్తాడా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల ఆడియో ఫంక్షన్లనే అనవసరం అంటూ ఉంటాడు. నిర్మాతల కోసం ప్రచారం కోసం తప్పదన్నట్లుగా ఆ కార్యక్రమాన్ని ముగించేసి వెళ్లిపోవడం పవన్ అలవాటు. అలాంటి తన వ్యక్తిగత ఫీలింగ్ ని పక్కన పెట్టి మరీ... ఇవాళ అ..ఆ.. ఆడియో వేడుకకు వస్తున్నాడు.

అ..ఆ.. ను తెరకెక్కించిన త్రివిక్రమ్.. పవన్ కు క్లోజ్ ఫ్రెండ్ కావడం, మరోవైపు హీరో నితిన్ పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతోనే.. ఈ ఫంక్షన్ కు వస్తున్నాడనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, ఇక్కడ పవన్ ఏం మాట్లాడబోతున్నాడనేది ఆసక్తికరం. రీసెంట్ గా పవన్ అన్నీ తానై తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది. ఈ మూవీని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అంకితం ఇవ్వడం కూడా గమనించాలి. అటు అన్నయ్యను, ఇటు ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచబోననే నమ్మకం ఉందని పవన్ చెప్పాడు కానీ.. చివరకు అలానే జరిగింది. పవన్ పై నమ్మకం పెట్టుకున్న అభిమానులు.. తీవ్రంగా హర్ట్ అయ్యారు.

ఇలాంటి నెగిటివ్ రిజల్ట్ ను పవర్ స్టార్ పట్టించుకోకపోయినా.. ఫ్యాన్స్ విషయానికి వచ్చే సరికి ప్రతీదీ లెక్కే.. మరి అన్ని మాటలు చెప్పి.. నిరుత్సాహపరిచింనందుకు ఫ్యాన్స్ కు పవన్ సారీ చెబుతాడా.. సర్దార్ గురించి కామెంట్ చేస్తాడా అన్నది ఇఫ్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, పవన్ ఇలాంటివి మాట్లాడితేనే ఆశ్చర్యపోవాలి కానీ.. మాట్లాడకపోతే అసలు మ్యాటరే లేదంటున్నారు చాలామంది.