Begin typing your search above and press return to search.

ప్రియాంక పెళ్ళి: కళ్ళన్నీ ఆవిడ పైనే!

By:  Tupaki Desk   |   4 Dec 2018 6:08 AM GMT
ప్రియాంక పెళ్ళి: కళ్ళన్నీ ఆవిడ పైనే!
X
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ల పెళ్ళి.. సంగీత్ ఈవెంట్ జోధ్ పుర్ లో జరిగిందన్న విషయం తెలిసిందే. అసలే గ్లోబల్ సుందరి.. ఆమెరికన్ సింగర్ జోడీ కావడంతో సంగీత్ అనేది ఒక మరపురాని ఈవెంట్ గా జరిగిందట. ఆటపాటలతో ప్రియాంక - నిక్ బంధువుల తో పాటుగా ఫ్రెండ్స్ అందరూ చెలరేగిపోయారట.

కానీ అందరిలోనూ హైలైట్ గా నిలిచింది.. అందరి కళ్ళను తనవైపు తిప్పుకుంది మాత్రం ప్రియాంకకు త్వరలో తోడికోడలు కానున్న సోఫీ టర్నర్. ఈమె నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ ను త్వరలో పెళ్ళి చేసుకోనుంది. ఇక ఈమె ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సీరిస్ లో సాన్సా స్టార్క్ పాత్ర పోషించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. ఈమె ప్రియాంక టైపులోనే చాలా చాలా పాపులర్.

ఈ సంగీత్ ఫంక్షన్లో సందీప్ ఖోస్లా.. అబూ జాని లు డిజైన్ చేసిన ఇండియన్ స్టైల్ కాస్ట్యూమ్ ధరించడమే కాకుండా డ్యాన్స్ ఫ్లోర్ ను రఫ్ఫాడించిందట. అసలే అమెరికన్ అందగత్తె.. ఇండియన్ డ్రస్ లో రచ్చ చేస్తే ఇక అందరి చూపు ఆమె వైపే కదా. మొత్తానికి ప్రియాంక కు సరిగ్గా సరిపోయే తో.కో. తోకో ఏంటని పెద్దగా ఆలోచన అవసరం లేదు. తోడికోడలు షార్ట్ ఫామ్.. మన పాత తెలుగు సినిమాల్లో ఈ షార్ట్ కట్ వాడుతుంటారు.